కీర్తనలు 99:1-9

  • యెహోవా పవిత్రుడైన రాజు

    • కెరూబుల పైన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు (1)

    • క్షమించే, శిక్షించే దేవుడు (8)

99  యెహోవా రాజయ్యాడు.+ దేశదేశాల ప్రజలు వణకాలి. ఆయన కెరూబుల పైన* సింహాసనంలో కూర్చొని ఉన్నాడు.+ భూమి కంపించాలి.   సీయోనులో యెహోవా గొప్పవాడు,దేశదేశాల ప్రజలందరి మీద ఆయన ఉన్నతంగా ఉన్నాడు.+   వాళ్లు నీ గొప్ప పేరును స్తుతించాలి,+ఎందుకంటే అది సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది, పవిత్రమైనది.   ఆయన గొప్పశక్తి గల రాజు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు సరైనదాన్ని సుస్థిరం చేశావు. యాకోబులో నీతిన్యాయాలు జరిగించావు.+   మన దేవుడైన యెహోవాను ఘనపర్చండి,+ ఆయన పాదపీఠం దగ్గర వంగి నమస్కారం చేయండి;*+ఆయన పవిత్రుడు.+   ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు,+ఆయన పేరున ప్రార్థించే వాళ్లలో సమూయేలు ఉన్నాడు.+ వాళ్లు యెహోవాకు ప్రార్థించేవాళ్లు,ఆయన వాళ్లకు జవాబిచ్చేవాడు.+   ఆయన మేఘస్తంభం నుండి వాళ్లతో మాట్లాడేవాడు.+ ఆయన జ్ఞాపికల్ని, ఆయన తమకిచ్చిన ఆదేశాన్ని వాళ్లు పాటించారు.+   యెహోవా, మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు.+ నువ్వు వాళ్ల తప్పుల్ని క్షమించావు,+కానీ వాళ్లు చేసిన పాపపు పనుల్ని బట్టి వాళ్లను శిక్షించావు.*+   మన దేవుడైన యెహోవాను ఘనపర్చండి,ఆయన పవిత్ర పర్వతం+ ముందు వంగి నమస్కారం చేయండి,*ఎందుకంటే మన దేవుడైన యెహోవా పవిత్రుడు.+

అధస్సూచీలు

లేదా “మధ్య” అయ్యుంటుంది.
లేదా “ఆరాధించండి.”
అక్ష., “వాళ్లమీద ప్రతీకారం తీర్చుకున్నావు.”
లేదా “ఆరాధించండి.”