కీర్తనలు 140:1-13

  • యెహోవా బలమైన రక్షకుడు

    • చెడ్డవాళ్లు పాముల్లాంటి వాళ్లు (3)

    • దౌర్జన్యం చేసేవాళ్లు నాశనమౌతారు (11)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 140  యెహోవా, చెడ్డవాళ్ల నుండి నన్ను రక్షించు,దౌర్జన్యం చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు;+   వాళ్లు తమ హృదయాల్లో దుష్ట పన్నాగాలు పన్నుతారు,+రోజంతా గొడవలు పుట్టిస్తారు.   వాళ్లు పాము నాలుకలా తమ నాలుకకు పదును పెడతారు;+వాళ్ల పెదాల వెనక పాము విషం ఉంది.+ (సెలా)   యెహోవా, దుష్టుల చేతుల్లో నుండి నన్ను రక్షించు;+దౌర్జన్యం చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు, వాళ్లు నన్ను పడేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు.   అహంకారులు నా కోసం చాటుగా ఉచ్చు పెట్టారు;తాళ్లతో పేనిన వలను దారి పక్కన పరిచారు.+ నా కోసం ఉరులు పెట్టారు.+ (సెలా)   నేను యెహోవాతో ఇలా అన్నాను: “నువ్వే నా దేవుడివి. యెహోవా, సహాయం కోసం నేను చేసే విన్నపాలు ఆలకించు.”+   సర్వోన్నత ప్రభువైన యెహోవా, బలమైన నా రక్షకుడా,యుద్ధం జరిగే రోజున నువ్వు నా తలను కాపాడతావు.+   యెహోవా, దుష్టులు కోరుకునేవి వాళ్లకు ఇవ్వకు. వాళ్ల కుట్రల్ని సఫలం కానివ్వకు, లేదంటే వాళ్లు రెచ్చిపోతారు.+ (సెలా)   నన్ను చుట్టుముట్టినవాళ్ల పెదాలు పలికిన కీడువాళ్ల తలల మీదికే రావాలి.+ 10  వాళ్ల మీద నిప్పులు కురవాలి.+ వాళ్లు అగ్నిలోకి విసిరేయబడాలి,మళ్లీ పైకి రాకుండా లోతైన గుంటల్లోకి* పడేయబడాలి.+ 11  ఇతరుల మీద లేనిపోనివి చెప్పేవాళ్లకు భూమ్మీద* చోటే దొరకకూడదు.+ దౌర్జన్యం చేసేవాళ్లను కీడు తరిమి నాశనం చేయాలి. 12  యెహోవా దీనుల తరఫున వాదిస్తాడని,పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాడని నాకు తెలుసు.+ 13  నీతిమంతులు తప్పకుండా నీ పేరుకు కృతజ్ఞతలు చెప్తారు;నిజాయితీపరులు నీ సన్నిధిలో నివసిస్తారు.+

అధస్సూచీలు

లేదా “నీటి గుంటల్లోకి.”
లేదా “దేశంలో.”