కీర్తనలు 3:1-8

  • ప్రమాదంలో కూడా దేవునిపై నమ్మకం

    • ‘ఎందుకు ఇంతమంది శత్రువులు?’ (1)

    • “యెహోవా, రక్షించేవాడివి నువ్వే” (8)

తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నప్పుడు దావీదు రచించిన శ్రావ్యగీతం.+ 3  యెహోవా, నా శత్రువులు ఎందుకు ఎక్కువయ్యారు?+ ఎందుకు ఇంతమంది నా మీదికి లేస్తున్నారు?+  2  “దేవుడు అతన్ని రక్షించడు” అని చాలామంది నా గురించి అంటున్నారు.+ (సెలా)*  3  కానీ యెహోవా, నువ్వు నా చుట్టూ డాలులా ఉన్నావు,+నువ్వే నా మహిమవు,+ నా తల పైకెత్తే దేవుడివి.+  4  నేను యెహోవాకు బిగ్గరగా మొరపెట్టుకుంటాను,ఆయన తన పవిత్ర పర్వతం+ నుండి నాకు జవాబిస్తాడు. (సెలా)  5  నేను పడుకుని నిద్రపోతాను,సురక్షితంగా మేల్కొంటాను.ఎందుకంటే, యెహోవా నాకు మద్దతిస్తూ ఉన్నాడు.+  6  వేలమంది అన్నివైపులా నన్నుచుట్టుముట్టినా నేను భయపడను.+  7  యెహోవా, లే! నా దేవా, నన్ను రక్షించు!+ నువ్వు నా శత్రువులందర్నీ దవడ మీద కొడతావు;దుష్టుల పళ్లు విరగ్గొడతావు.+  8  యెహోవా, రక్షించేవాడివి నువ్వే.+ నీ ప్రజల మీద నీ దీవెన ఉంటుంది. (సెలా)

అధస్సూచీలు

పదకోశం చూడండి.