కీర్తనలు 4:1-8
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. దావీదు శ్రావ్యగీతం.
4 నీతిగల నా దేవా,+ నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబివ్వు.
కష్టాల్లో ఉన్నప్పుడు తప్పించుకునే మార్గాన్ని కలగజేయి.*
నా మీద అనుగ్రహం చూపించు, నా ప్రార్థన విను.
2 ప్రజలారా, మీరు ఎంతకాలం నన్ను అవమానిస్తారు?
ఎంతకాలం వ్యర్థమైనవాటిని ప్రేమిస్తారు, అబద్ధమైనవాటిని వెదుకుతారు? (సెలా)
3 ఈ విషయం తెలుసుకోండి, యెహోవా తన విశ్వసనీయుల్ని ప్రత్యేకంగా చూసుకుంటాడు;*నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు.
4 మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి.+
మీరు అనాలనుకున్నది మీ మంచం మీద మీ హృదయంలోనే అనుకొని, మౌనంగా ఉండండి. (సెలా)
5 నీతి* బలులు అర్పించి,యెహోవా మీద నమ్మకం ఉంచండి.+
6 “మాకు మంచివాటిని ఎవరు ఇస్తారు?” అని చాలామంది అంటున్నారు,
యెహోవా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.+
7 సమృద్ధిగా ధాన్యం, కొత్త ద్రాక్షారసం లభించినవాళ్ల కన్నాఎక్కువ ఉల్లాసంతో నువ్వు నా హృదయాన్ని నింపావు.
8 నేను పడుకుని ప్రశాంతంగా నిద్రపోతాను,+ఎందుకంటే యెహోవా, నువ్వు మాత్రమే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు.+
అధస్సూచీలు
^ అక్ష., “స్థలాన్ని విశాలం చేయి.”
^ లేదా “గౌరవిస్తాడు; తన కోసం ప్రత్యేకపర్చుకుంటాడు.”
^ లేదా “మంచి హృదయంతో.”