కీర్తనలు 29:1-11

  • యెహోవా శక్తివంతమైన స్వరం

    • పవిత్రమైన బట్టలు వేసుకుని ఆరాధించండి (2)

    • “మహిమగల దేవుడు ఉరుముతున్నాడు” (3)

    • యెహోవా తన ప్రజల్ని బలపరుస్తాడు (11)

దావీదు శ్రావ్యగీతం. 29  బలవంతుల కుమారులారా, యెహోవాకు తగిన ఘనత ​ఆయనకు ఇవ్వండి;యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ​ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+   యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*   యెహోవా స్వరం నీళ్ల మీద వినిపిస్తోంది;మహిమగల దేవుడు ఉరుముతున్నాడు.+ యెహోవా అనేక జలాల మీద ఉన్నాడు.+   యెహోవా స్వరం శక్తివంతమైనది;+యెహోవా స్వరం మహిమగలది.   యెహోవా స్వరం దేవదారు చెట్లను విరగ్గొడుతుంది;అవును, యెహోవా లెబానోను దేవదారు చెట్లను+ ముక్కలుముక్కలు చేస్తాడు.   ఆయన లెబానోనును* దూడలా,షిర్యోనును+ కోడెదూడలా గంతులు వేసేట్టు చేస్తాడు.   యెహోవా స్వరం అగ్నిజ్వాలలతో విరుచుకుపడుతుంది.+   యెహోవా స్వరం ఎడారిని* వణికిపోయేలా చేస్తుంది;+యెహోవా కాదేషు ఎడారిని+ వణికిపోయేలా చేస్తాడు.   యెహోవా స్వరం జింకను ఈనేలా చేస్తుంది,అడవిలోని చెట్లను మోడుగా చేస్తుంది.+ ఆయన ఆలయంలో ఉన్నవాళ్లందరూ, “దేవుణ్ణి మహిమపర్చండి” అంటారు. 10  యెహోవా ప్రళయ జలాల* పైన ​సింహాసనాసీనుడై ఉన్నాడు;+యెహోవా నిరంతరం రాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు.+ 11  యెహోవా తన ప్రజలకు బలాన్నిస్తాడు.+ యెహోవా తన ప్రజల్ని శాంతితో దీవిస్తాడు.+

అధస్సూచీలు

లేదా “ఆయన పవిత్రతకు ఉన్న వైభవాన్ని బట్టి” అయ్యుంటుంది.
లేదా “ఆరాధించండి.”
లెబానోను పర్వతశ్రేణి అని స్పష్టమౌతోంది.
పదకోశం చూడండి.
లేదా “ఆకాశ మహాసముద్రం.”