కీర్తనలు 82:1-8

  • నీతితో తీర్పు తీర్చమని పిలుపు

    • “దేవుళ్ల మధ్య” దేవుడు తీర్పు తీరుస్తున్నాడు (1)

    • ‘దీనుల్ని కాపాడండి’ (3)

    • “మీరు దేవుళ్లు” (6)

ఆసాపు+ శ్రావ్యగీతం. 82  దేవుని సమాజంలో దేవుడు ​నిలిచివున్నాడు;+దేవుళ్ల* మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు,+ ఆయన ఇలా అంటున్నాడు:   “ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు,+దుష్టుల పట్ల పక్షపాతం చూపిస్తారు?+ (సెలా)   దీనుల్ని, తండ్రిలేని వాళ్లను కాపాడండి.*+ నిస్సహాయులకు, దిక్కులేనివాళ్లకు న్యాయం చేయండి.+   దీనుల్ని, పేదవాళ్లను రక్షించండి;దుష్టుల చేతుల్లో నుండి వాళ్లను ​కాపాడండి.”   వాళ్లకు తెలీదు, వాళ్లకు అర్థంకాదు;+వాళ్లు చీకట్లో తిరుగులాడుతున్నారు;భూమి పునాదులన్నీ కుదిపేయబడుతున్నాయి.+   “నేను* ఇలా అన్నాను: ‘మీరు దేవుళ్లు,*+మీరంతా సర్వోన్నతుని కుమారులు.   అయితే మనుషుల్లాగే మీరు కూడా ​చనిపోతారు;+ఇతర అధిపతుల్లాగే మీరూ ​పడిపోతారు!’ ”+   దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు,+ఎందుకంటే దేశాలన్నీ నీవే.

అధస్సూచీలు

లేదా “దేవునిలాంటి వాళ్ల.”
లేదా “న్యాయం తీర్చండి.”
అంటే, దేవుడు.
లేదా “దేవునిలాంటి వాళ్లు.”