కీర్తనలు 39:1-13
సంగీత నిర్దేశకునికి సూచన; యెదూతూనుది.*+ దావీదు శ్రావ్యగీతం.
39 “నా నాలుకతో పాపం చేయకుండా+నేను జాగ్రత్తగా ఉంటాను.
దుష్టుడు నా దగ్గర ఉన్నంతసేపునా నోటికి చిక్కం పెట్టుకుంటాను”+ అని నేను అనుకున్నాను.
2 నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను;+కనీసం మంచివాటి గురించి కూడా మాట్లాడలేదు,కానీ నా వేదన చాలా తీవ్రంగా ఉంది.
3 నా గుండెలో మంట రగులుకుంది.
నేను ఆలోచించే* కొద్దీ ఆ మంట ఎక్కువౌతూ ఉంది.
అప్పుడు నేను ఇలా అన్నాను:
4 “యెహోవా, నా అంతం ఎప్పుడు వస్తుందో,నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియజేయి;+అప్పుడు, నా జీవితం ఎంత చిన్నదో* నేను తెలుసుకుంటాను.
5 నిజంగా, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్షు చాలా తక్కువ;*+నీ దృష్టికి అది లెక్కకే రాదు.+
ప్రతీ మనిషి క్షేమంగా ఉన్నట్టు కనిపించినా, అతను కేవలం ఊపిరి లాంటివాడే.+ (సెలా)
6 ప్రతీ మనిషి నీడలా తిరుగుతుంటాడు.
అనవసరంగా ప్రయాసపడతాడు.
అతను ఆస్తిని కూడబెట్టుకుంటాడు, దాన్ని ఎవరు అనుభవిస్తారో అతనికి తెలీదు.+
7 అలాంటప్పుడు, యెహోవా, నేను దేని కోసం ఆశపెట్టుకోవాలి?
నేను నీ మీదే ఆశపెట్టుకున్నాను.
8 నా అపరాధాలన్నిటి నుండి నన్ను కాపాడు.+
మూర్ఖుడు నన్ను అవమానించే పరిస్థితి రానివ్వకు.
9 నేను మౌనంగా ఉండిపోయాను;నా నోరు తెరవలేకపోయాను,+ఎందుకంటే నువ్వే ఇలా జరిగేట్టు చేశావు.+
10 నువ్వు పంపించిన తెగులును నా నుండి తీసేయి.
నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించిపోయాను.
11 మనిషి చేసిన తప్పునుబట్టి నువ్వు అతన్ని శిక్షించి సరిదిద్దుతావు;+అతను ఎంతో ఇష్టపడేవాటిని చిమ్మెటలా నాశనం చేస్తావు.
నిజంగా ప్రతీ మనిషి కేవలం ఊపిరి లాంటివాడు.+ (సెలా)
12 యెహోవా, నా ప్రార్థన విను,సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు.+
నా కన్నీళ్లు నిర్లక్ష్యం చేయకు.
ఎందుకంటే, నా పూర్వీకులందరిలా నేను నీ దృష్టికి పరదేశిని,+తాత్కాలిక నివాసిని మాత్రమే.+
13 నేను చనిపోయి కనుమరుగయ్యే లోపేకోపంతో నిండిన నీ చూపును నా మీద నుండి తీసేయి,
అప్పుడు నేను సంతోషిస్తాను.”