కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ ప్రశ్న

చనిపోయినవాళ్ల విషయంలో ఎలాంటి ఆశ ఉంది?

“దీనికి ఆశ్చర్యపోకండి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు.”

యోహాను 5:​28, 29

“నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”

అపొస్తలుల కార్యాలు 24:15

“గొప్పవాళ్లే గానీ, సామాన్యులే గానీ చనిపోయిన వాళ్లందరూ ఆ సింహాసనం ముందు నిలబడి ఉండడం నేను చూశాను. అప్పుడు గ్రంథపు చుట్టలు విప్పబడ్డాయి. అయితే ఇంకో గ్రంథపు చుట్ట విప్పబడింది, అది జీవగ్రంథం. చనిపోయినవాళ్లు గ్రంథపు చుట్టల్లో రాసివున్న వాటి ప్రకారం తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు. సముద్రం దానిలో ఉన్న మృతుల్ని అప్పగించింది. మరణం, సమాధి వాటిలో ఉన్న మృతుల్ని అప్పగించాయి. వాళ్లలో ప్రతీ ఒక్కరు తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.”

ప్రకటన 20:​12, 13