కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18వ ప్రశ్న

దేవునికి మీరెలా దగ్గర కావచ్చు?

“ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.”

కీర్తన 65:2

“నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.”

సామెతలు 3:​5, 6

“ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.”

యోహాను 17:3

“నిజానికి, [దేవుడు] మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.”

అపొస్తలుల కార్యాలు 17:27

“మీ ప్రేమ సరైన జ్ఞానం, మంచి వివేచనలతో పాటు అంతకంతకూ పెరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.”

ఫిలిప్పీయులు 1:9

“మీలో ఎవరికైనా తెలివి తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, అది అతనికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆయన కోప్పడకుండా అందరికీ ఉదారంగా ఇస్తాడు.”

యాకోబు 1:5

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి; చంచల స్వభావం గలవాళ్లారా, మీ హృదయాల్ని శుద్ధి చేసుకోండి.”

యాకోబు 4:8

“దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”

1 యోహాను 5:3