కీర్తనలు 18:1-50

  • రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించడం

    • “యెహోవా నా శైలం” (2)

    • యెహోవా విశ్వసనీయులతో విశ్వస​నీయంగా ఉంటాడు (25)

    • దేవుని మార్గం పరిపూర్ణమైనది (30)

    • “నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది” (35)

సంగీత నిర్దేశకునికి సూచన. యెహోవా సేవకు​డైన దావీదు కీర్తన. యెహోవా దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి రక్షించిన రోజున దావీదు యెహోవాకు పాడిన పాట. అతను ఇలా పాడాడు:+ 18  యెహోవా, నా బలమా,+ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.   యెహోవా నా శైలం,* నా కోట, నన్ను రక్షించే దేవుడు.+ నా దేవుడే నా ఆశ్రయదుర్గం,*+ నేను ఆయన్ని ఆశ్రయిస్తాను,ఆయనే నా డాలు, నా రక్షణ కొమ్ము,* నా సురక్షితమైన ఆశ్రయం.*+   స్తుతిపాత్రుడైన యెహోవాకు నేను ప్రార్థిస్తాను,నా శత్రువుల నుండి ఆయన నన్ను రక్షిస్తాడు.+   మరణపు తాళ్లు నన్ను చుట్టుముట్టాయి;+పనికిమాలినవాళ్లు ఆకస్మిక వరదల్లా నన్ను భయపెట్టారు.+   సమాధి* తాళ్లు నన్ను చుట్టుకున్నాయి;మరణపు ఉరులు నా ముందు ​పెట్టబడ్డాయి.+   నా శ్రమలో నేను యెహోవాకు ​ప్రార్థించాను,సహాయం కోసం నా దేవునికి ​మొరపెడుతూ వచ్చాను. ఆయన తన ఆలయంలో నుండి నా మొర విన్నాడు,+సహాయం కోసం నేను పెట్టిన మొర ఆయన దగ్గరికి చేరింది.+   అప్పుడు భూమి అదిరింది, కంపించింది;+పర్వతాల పునాదులు వణికిపోయాయి, అవి ముందుకీ వెనక్కీ కంపించాయి,ఎందుకంటే ఆయనకు కోపం వచ్చింది.+   ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగ లేచింది,ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది;+ఆయన నుండి మండుతున్న నిప్పులు బయల్దేరాయి.   ఆయన ఆకాశాన్ని వంచుతూ కిందికి దిగాడు,+ఆయన పాదాల కింద కటిక చీకటి ఉంది. 10  ఆయన కెరూబు మీద ఎగురుతూ వచ్చాడు.+ దేవదూత* రెక్కల+ మీద వేగంగా దిగివచ్చాడు. 11  అప్పుడు ఆయన నల్లని నీళ్లు, దట్టమైన మేఘాలు+ ఉన్న చీకటినిడేరాలా తన చుట్టూ కప్పుకున్నాడు. 12  ఆయన ఎదుట ఉన్న కాంతి నుండి,మబ్బుల గుండా వడగండ్లు, నిప్పులు వచ్చాయి. 13  అప్పుడు యెహోవా ఆకాశంలో గర్జించ​సాగాడు;+వడగండ్లతో, నిప్పులతో సర్వోన్నతుడు తన స్వరం వినిపించాడు.+ 14  ఆయన తన బాణాలతో వాళ్లను చెదరగొట్టాడు;+తన మెరుపుల్ని కురిపించి వాళ్లను గందర​గోళంలో పడేశాడు.+ 15  యెహోవా, నీ గద్దింపుకు, నీ ముక్కు రంధ్రాల నుండి వేగంగా వచ్చిన ఊపిరికినది అడుగుభాగం కనిపించింది;*+భూమి పునాదులు బయటపడ్డాయి.+ 16  ఆయన పైనుండి తన చెయ్యి చాపి,నన్ను పట్టుకొని లోతైన నీళ్లలో నుండి పైకి లాగాడు.+ 17  నా బలమైన శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన నా పగవాళ్ల నుండిఆయన నన్ను రక్షించాడు.+ 18  నాకు విపత్తు వచ్చిన రోజున వాళ్లు నన్ను ఎదిరించారు,+అయితే యెహోవా నన్ను ఆదుకున్నాడు. 19  ఆయన నన్ను సురక్షితమైన* స్థలంలోకి తీసుకొచ్చాడు;ఆయన నా విషయంలో సంతోషించాడు కాబట్టి నన్ను రక్షించాడు.+ 20  నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిస్తాడు;+నా చేతుల నిర్దోషత్వాన్ని* బట్టి నాకు ప్రతిఫలమిస్తాడు.+ 21  ఎందుకంటే, యెహోవా మార్గాల్ని నేను అనుసరించాను,నా దేవుణ్ణి విడిచిపెట్టడమనే తప్పు నేను చేయలేదు. 22  ఆయన తీర్పులన్నీ నా ముందు ఉన్నాయి;నేను ఆయన శాసనాల్ని నిర్లక్ష్యం చేయను. 23  నేను ఆయన ఎదుట ఎప్పటికీ నిందలేని వాడిగా ఉంటాను,+చెడుకు దూరంగా ఉంటాను.+ 24  నా నీతిని బట్టి, ఆయన ముందు నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టియెహోవా నాకు ప్రతిఫలమివ్వాలి.+ 25  విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు;+నిర్దోషులతో* నిర్దోషంగా ప్రవర్తిస్తావు;+ 26  నిజాయితీపరులతో నువ్వు నిజాయితీగా ఉంటావు,+వంకరబుద్ధి గలవాళ్లతో యుక్తిగా ​వ్యవహరిస్తావు.+ 27  నువ్వు దీనుల్ని* రక్షిస్తావు,+గర్విష్ఠుల్ని* కింద పడేస్తావు.+ 28  యెహోవా, నా చీకటిని వెలుగుగా మార్చే నా దేవా,నువ్వే నా దీపాన్ని వెలిగిస్తావు.+ 29  నీ సహాయంతో నేను దోపిడీ ముఠాతో పోరాడగలను;+దేవుని శక్తితో నేను ప్రాకారం మీదుగా దూకగలను.+ 30  సత్యదేవుని మార్గం పరిపూర్ణమైనది;+యెహోవా మాట స్వచ్ఛమైనది.+ తనను ఆశ్రయించేవాళ్లందరికీ ఆయన ఒక డాలు.+ 31  యెహోవా తప్ప దేవుడు ఎవరు?+ మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం* ఎవరు?+ 32  సత్యదేవుడే నాకు బలాన్నిస్తాడు,+ఆయనే నా మార్గాన్ని పరిపూర్ణం చేస్తాడు.+ 33  ఆయన నా కాళ్లను జింక కాళ్లలా చేస్తాడు;ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతాడు.+ 34  ఆయన, యుద్ధం కోసం నా చేతులకు శిక్షణ ఇస్తాడు;నా చేతులు రాగి విల్లును వంచగలవు. 35  నువ్వు నీ రక్షణ డాలును నాకు ఇస్తావు,+నీ కుడిచెయ్యి నాకు సహాయం చేస్తుంది,*నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది.+ 36  నువ్వు నా అడుగుల కోసం దారిని వెడల్పు చేస్తావు;నా పాదాలు జారవు.+ 37  నేను నా శత్రువుల్ని తరిమి ​పట్టుకుంటాను;వాళ్లు తుడిచిపెట్టుకుపోయేంత వరకు నేను వెనక్కి రాను. 38  వాళ్లు మళ్లీ లేవకుండా నేను వాళ్లను పూర్తిగా నలగ్గొడతాను;+వాళ్లు నా పాదాల కింద కూలతారు. 39  యుద్ధం కోసం నువ్వు నాకు శక్తినిస్తావు;నా విరోధులు నా ఎదుట కూలిపోయేలా చేస్తావు.+ 40  నా శత్రువులు నా దగ్గర నుండి ​పారిపోయేలా చేస్తావు;నన్ను ద్వేషించేవాళ్లను నేను అంతం చేస్తాను.+ 41  వాళ్లు సహాయం కోసం మొరపెడతారు, కానీ రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు;వాళ్లు యెహోవాకు కూడా మొరపెడతారు, కానీ ఆయన వాళ్లకు ​జవాబివ్వడు. 42  నేను వాళ్లను గాలిలో ధూళి అంత మెత్తగా నలగ్గొడతాను;వీధుల్లో మట్టిలా వాళ్లను బయట పడేస్తాను. 43  తప్పులుపట్టే ప్రజల నుండి నువ్వు నన్ను రక్షిస్తావు.+ దేశాల అధిపతిగా నన్ను నియమిస్తావు;+ నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు.+ 44  కేవలం నా గురించి విన్నదాన్ని బట్టి వాళ్లు నాకు లోబడతారు;విదేశీయులు వచ్చి నాకు వంగి నమస్కారం చేస్తారు.+ 45  వాళ్లు ధైర్యం కోల్పోతారు;*వాళ్లు వణుక్కుంటూ తమ కోటల్లో నుండి బయటికి వస్తారు. 46  యెహోవా సజీవుడు! నా ఆశ్రయదుర్గం*+ స్తుతించబడాలి! నా రక్షకుడైన దేవుడు హెచ్చించబడాలి.+ 47  సత్యదేవుడు నా తరఫున పగతీర్చు​కుంటాడు;+దేశదేశాల ప్రజల్ని నాకు లోబరుస్తాడు. 48  కోపంగా ఉన్న నా శత్రువుల నుండి నన్ను కాపాడతాడు;నామీద దాడిచేసే వాళ్లకన్నా నన్ను నువ్వు పైకి ఎత్తుతావు;+ దౌర్జన్యం చేసేవాడి నుండి నన్ను ​కాపాడతావు. 49  అందుకే యెహోవా, అన్యజనుల మధ్య నేను నిన్ను ఘనపరుస్తాను,+నీ పేరును స్తుతిస్తూ పాటలు ​పాడతాను.*+ 50  ఆయన తన రాజు కోసం గొప్ప రక్షణ కార్యాలు చేస్తాడు;*+తాను అభిషేకించిన దావీదు మీద,అతని సంతానం* మీద ఎప్పటికీ+ ​విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు.+

అధస్సూచీలు

లేదా “పెద్ద రాతిబండ.”
అక్ష., “బండరాయి.”
లేదా “నా బలమైన రక్షకుడు.” పదకోశంలో “కొమ్ము” చూడండి.
లేదా “ఎత్తైన స్థలం.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “గాలి.”
లేదా “నీటి కాలువలు కనిపించాయి.”
లేదా “విశాలమైన.”
అక్ష., “శుద్ధతను.”
లేదా “నిందలేని వాళ్లతో.”
లేదా “బాధితుల్ని.”
అక్ష., “గర్వించే కళ్లను.”
అక్ష., “బండరాయి.”
లేదా “నన్ను ఆదుకుంటుంది.”
లేదా “వాడిపోతారు.”
అక్ష., “బండరాయి.”
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “గొప్ప విజయాలు ఇస్తాడు.”
అక్ష., “విత్తనం.”