కీర్తనలు 134:1-3

  • రాత్రివేళ దేవుణ్ణి స్తుతించడం

    • “పవిత్రతతో మీ చేతులెత్తి” (2)

యాత్ర కీర్తన. 134  యెహోవా సేవకులారా,రాత్రివేళ యెహోవా మంది​రంలో నిలబడే ఆయన సేవకులారా,+మీరంతా యెహోవాను స్తుతించండి.+   పవిత్రతతో* మీ చేతులెత్తి+యెహోవాను స్తుతించండి.   భూమ్యాకాశాల్ని చేసిన యెహోవాసీయోనులో నుండి నిన్ను దీవించాలి.

అధస్సూచీలు

లేదా “పవిత్రమైన స్థలంలో” అయ్యుంటుంది.