కీర్తనలు 5:1-12

  • యెహోవా నీతిమంతుల ఆశ్రయం

    • దేవునికి దుష్టత్వం అంటే అసహ్యం (4, 5)

    • “నన్ను నీ నీతి మార్గంలో నడిపించు” (8)

నెహిలోతు* కోసం సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 5  యెహోవా, నా మాటలు ఆలకించు;+నా నిట్టూర్పుల్ని పట్టించుకో.   నా రాజా, నా దేవా, సహాయం కోసం నేను పెట్టే మొరను లక్ష్యపెట్టు;ఎందుకంటే నీకే నేను ప్రార్థిస్తున్నాను.   యెహోవా, ఉదయం నువ్వు నా స్వరం వింటావు;+ఉదయం నా ఆందోళనను నీకు చెప్పుకొని+ వేచివుంటాను.   నువ్వు దుష్టత్వాన్ని చూసి సంతోషించే దేవుడివి కాదు;+చెడ్డవాళ్లెవ్వరికీ నీ దగ్గర చోటులేదు.+   అహంకారులెవ్వరూ నీ సమక్షంలో నిలబడలేరు.దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్లందర్నీ నువ్వు ద్వేషిస్తావు;+   అబద్ధాలాడేవాళ్లను నువ్వు నాశనం చేస్తావు.+ దౌర్జన్యపరుల్ని, వంచకుల్ని* యెహోవా అసహ్యించుకుంటాడు.+   అయితే నేను, నీ గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి+ నీ ఆలయంలోకి+ వస్తాను;నీ మీద భయభక్తులతో నీ పవిత్ర ఆలయం* వైపు తిరిగి నమస్కరిస్తాను.+   యెహోవా, నా చుట్టూ ఉన్న శత్రువుల్ని బట్టి నన్ను నీ నీతి మార్గంలో నడిపించు;నేను తడబడకుండా నడిచేలా దాన్ని సరాళం చేయి.+   వాళ్లు చెప్పేదేదీ నమ్మలేం;వాళ్ల హృదయాల్లో చెడు తప్ప ఇంకేమీ లేదు;వాళ్ల గొంతు తెరిచివున్న సమాధి;వాళ్లు తమ నాలుకతో పొగుడుతారు.*+ 10  అయితే దేవుడు వాళ్లను అపరాధులుగా తీర్పు తీరుస్తాడు;వాళ్ల పన్నాగాలే వాళ్ల పతనానికి దారితీస్తాయి.+ వాళ్ల అనేక అపరాధాల కారణంగా వాళ్లు వెళ్లగొట్టబడాలి,ఎందుకంటే, వాళ్లు నీ మీద తిరుగుబాటు చేశారు. 11  కానీ నిన్ను ఆశ్రయించేవాళ్లందరూ ఉల్లసిస్తారు;+వాళ్లు ఎప్పుడూ సంతోషంతో కేకలు వేస్తారు. నువ్వు వాళ్ల దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వవు,నీ పేరును ప్రేమించేవాళ్లు నిన్ను బట్టి ఉల్లసిస్తారు. 12  ఎందుకంటే యెహోవా, నువ్వు నీతిమంతుల్ని ఆశీర్వదిస్తావు;వాళ్లమీద అనుగ్రహం చూపిస్తావు, పెద్ద డాలులా వాళ్లను కాపాడతావు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “రక్తం చిందించే, మోసం చేసే వ్యక్తిని.”
లేదా “పవిత్రమైన స్థలం.”
లేదా “తియ్యగా మాట్లాడతారు.”