కీర్తనలు 31:1-24

  • యెహోవాను ఆశ్రయించడం

    • “నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను” (5)

    • “యెహోవా, సత్యవంతుడివైన దేవా” (5)

    • దేవుని మంచితనం విస్తారమైనది (19)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 31  యెహోవా, నిన్నే నేను ఆశ్రయించాను.+ నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వకు.+ నీ నీతిని బట్టి నన్ను రక్షించు.+   నా మాటలు చెవిపెట్టి విను.* నన్ను రక్షించడానికి త్వరగా రా.+ నా కోసం ఆశ్రయ పర్వతంగా,నన్ను కాపాడడానికి ప్రాకారాలుగల స్థలంగా అవ్వు.+   ఎందుకంటే నువ్వే నా శైలం,* నా కోట;+నీ పేరు కోసం+ నువ్వు నన్ను నడిపిస్తావు, నాకు నిర్దేశమిస్తావు.+   నా కోసం వాళ్లు రహస్యంగా పెట్టిన వలలో నుండి నువ్వు నన్ను ​విడిపిస్తావు,+ఎందుకంటే నువ్వే నా కోట.+   నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను.+ యెహోవా, సత్యవంతుడివైన దేవా,*+ నువ్వు నన్ను విడిపించావు.   పనికిరాని వ్యర్థమైన విగ్రహాల్ని పూజించేవాళ్లంటే నాకు అసహ్యం,నేనైతే యెహోవాను నమ్ముకున్నాను.   నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నేను ఎంతో ఉల్లసిస్తాను,ఎందుకంటే నువ్వు నా బాధల్ని చూశావు;+నా తీవ్రమైన వేదన నీకు తెలుసు.   నువ్వు నన్ను శత్రువుకు అప్పగించలేదు,బదులుగా సురక్షితమైన* స్థలంలో నన్ను నిలబెడతావు.   యెహోవా, నేను కష్టాల్లో ఉన్నాను, నా మీద అనుగ్రహం చూపించు. వేదన వల్ల నా కళ్లు, నా శరీరమంతా బలహీనమయ్యాయి.+ 10  దుఃఖం వల్ల నా జీవితం,మూల్గుల వల్ల నా సంవత్సరాలు ​తరిగిపోయాయి.+ నా తప్పు కారణంగా నా శక్తి క్షీణిస్తోంది;నా ఎముకలు బలహీనమయ్యాయి.+ 11  నా విరోధులందరూ,ముఖ్యంగా నా పొరుగువాళ్లు నన్ను హీనంగా చూస్తున్నారు.+ తెలిసినవాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు;వాళ్లు బయట నన్ను చూసినప్పుడు నా దగ్గర నుండి పారిపోతున్నారు.+ 12  నేను చనిపోయానన్నట్టు, తమ ​మనసులో* నుండి నన్ను తీసేశారు, నన్ను మర్చిపోయారు;నేను పగిలిపోయిన కుండలా ఉన్నాను. 13  నేను ఎన్నో తప్పుడు పుకార్లు విన్నాను;నాకు భయం పట్టుకుంది.+ వాళ్లంతా కలిసి నాకు వ్యతిరేకంగా ​సమకూడినప్పుడునా ప్రాణాన్ని తీయడానికి కుట్ర పన్నుతున్నారు.+ 14  కానీ యెహోవా, నాకు నీ మీద నమ్మకముంది.+ “నువ్వే నా దేవుడివి” అని నేను ​ప్రకటిస్తాను.+ 15  నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల చేతిలో నుండి, నన్ను హింసిస్తున్నవాళ్ల చేతిలో నుండి నన్ను రక్షించు.+ 16  నీ సేవకుని మీద నీ ముఖం ​ప్రకాశింపజేయి.+ నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను కాపాడు. 17  యెహోవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నన్ను సిగ్గుపడేలా చేయకు.+ దుష్టుల్ని సిగ్గుపడేలా చేయి;+సమాధిలో* వాళ్ల నోళ్లు మూతపడాలి.+ 18  అబద్ధాలాడే పెదాలు,గర్వంతో, అహంకారంతో, తిరస్కారంతో నీతిమంతులకు వ్యతిరేకంగా మాట్లాడే పెదాలు నిశ్శబ్దమైపోవాలి.+ 19  దేవా, నీ మంచితనం ఎంత విస్తారమైనది!+ నీకు భయపడేవాళ్ల కోసం నువ్వు దాన్ని దాచివుంచావు,+నిన్ను ఆశ్రయించేవాళ్ల తరఫున మనుషులందరి ముందు నువ్వు దాన్ని ​చూపించావు.+ 20  మనుషుల కుట్రల నుండి వాళ్లను ​కాపాడడానికినీ సన్నిధిలోని రహస్య స్థలంలో నువ్వు వాళ్లను దాస్తావు;+హానికరమైన దాడుల* నుండి వాళ్లను రక్షించడానికినీ ఆశ్రయంలో దాస్తావు.+ 21  యెహోవా స్తుతించబడాలి,ఎందుకంటే, ముట్టడించబడిన నగరంలో+ ఆయన అద్భుత రీతిలో నా మీద ​విశ్వసనీయ ప్రేమ చూపించాడు.+ 22  కానీ నేను కంగారుపడి, “నీ ఎదుట ఉండకుండా నేను నాశన​మౌతాను” అన్నాను.+ కానీ నేను నీకు మొరపెట్టినప్పుడు, సహాయం కోసం నేను చేసిన ​విన్నపాల్ని నువ్వు విన్నావు.+ 23  యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవాళ్లారా, మీరందరూ ఆయన్ని ​ప్రేమించండి!+ యెహోవా నమ్మకమైనవాళ్లను రక్షిస్తాడు,+అయితే, అహంకారం చూపించేవాళ్లను తీవ్రంగా శిక్షిస్తాడు.+ 24  యెహోవా కోసం వేచివున్నవాళ్లారా,+మీరందరూ ధైర్యంగా ఉండండి, మీ హృదయం నిబ్బరంగా ఉండాలి.+

అధస్సూచీలు

లేదా “కిందికి వంగి, విను.”
లేదా “పెద్ద రాతిబండ.”
లేదా “నమ్మకమైన దేవా.”
లేదా “విశాలమైన.”
అక్ష., “హృదయంలో.”
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.
లేదా “మాటల దాడుల.”