కీర్తనలు 142:1-7

  • హింసించేవాళ్ల నుండి కాపాడమని ప్రార్థన

    • “నేను ఎక్కడికీ పారిపోలేను” (4)

    • ‘నాకున్నదల్లా నువ్వే’ (5)

మాస్కిల్‌.* దావీదు కీర్తన. దావీదు గుహలో ఉన్నప్పటిది.+ ప్రార్థన. 142  నేను సహాయం కోసం యెహోవాకు మొరపెడుతున్నాను;+యెహోవా దయ కోసం వేడుకుంటున్నాను.  2  ఆయన ముందు నా ఆలోచనలు కుమ్మరిస్తున్నాను;ఆయన ముందు నా కష్టాలు చెప్పుకుంటున్నాను,+  3  నా బలం క్షీణించినప్పుడు నేను ఆయనకు మొరపెడుతున్నాను. అప్పుడు నువ్వు నా అడుగుల్ని గమనిస్తావు.+ నేను నడిచే దారిలోవాళ్లు నా కోసం చాటుగా ఉచ్చు పెడుతున్నారు.  4  నా కుడిచేతి వైపు చూడు,నా గురించి పట్టించుకునేవాళ్లు ఎవ్వరూ లేరు.*+ నేను ఎక్కడికీ పారిపోలేను;+నా గురించి ఆలోచించేవాళ్లు ఎవ్వరూ లేరు.  5  యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. “నువ్వే నా ఆశ్రయం,+సజీవుల దేశంలో నాకున్నది నువ్వొక్కడివే”* అని అంటున్నాను.  6  సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు,నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. నన్ను హింసించేవాళ్ల నుండి నన్ను కాపాడు,+వాళ్లు నాకంటే బలవంతులు.  7  నీ పేరును స్తుతించేలాచెరసాలలో నుండి నన్ను బయటికి తీసుకురా. నువ్వు నాతో దయగా వ్యవహరిస్తావు,అది చూసి నీతిమంతులు నా చుట్టూ చేరి సంతోషిస్తారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు.”
అక్ష., “నా వంతు నువ్వే.”