కీర్తనలు 97:1-12

  • యెహోవా ఇతర దేవుళ్ల కన్నా హెచ్చించబడ్డాడు

    • “యెహోవా రాజయ్యాడు!” (1)

    • యెహోవాను ప్రేమించండి, చెడును అసహ్యించుకోండి (10)

    • నీతిమంతులకు వెలుగు (11)

97  యెహోవా రాజయ్యాడు!+ భూమి సంతోషించాలి.+ ద్వీపాలన్నీ ఆనందించాలి.+   మేఘాలు, కటిక చీకటి ఆయన చుట్టూ ఉన్నాయి;+నీతిన్యాయాలు ఆయన సింహాసనానికి పునాదులు.+   అగ్ని ఆయన ముందు వెళ్తూ+అన్నివైపులా ఉన్న ఆయన శత్రువుల్ని దహించేస్తుంది.+   ఆయన మెరుపులు లోకానికి వెలుగిస్తాయి;అది చూసి భూమి వణుకుతుంది.+   యెహోవా ముందు, సర్వలోక ప్రభువు ముందుపర్వతాలు మైనంలా కరిగిపోతాయి.+   ఆకాశం ఆయన నీతిని ప్రకటిస్తుంది,దేశదేశాల ప్రజలు ఆయన మహిమను చూస్తారు.+   చెక్కుడు విగ్రహాన్ని సేవించే వాళ్లంతా,తమ వ్యర్థమైన దేవుళ్ల+ గురించి గొప్పలు చెప్పుకునే వాళ్లంతా సిగ్గుపర్చబడాలి.+ దేవుళ్లారా, మీరంతా ఆయనకు వంగి నమస్కారం చేయండి.*+   సీయోను విని సంతోషిస్తుంది;+యెహోవా, నీ తీర్పుల్ని బట్టియూదా పట్టణాలు* ఆనందిస్తున్నాయి.   ఎందుకంటే యెహోవా, నువ్వు భూమంతటి పైన మహోన్నతుడివి;*దేవుళ్లందరి కంటే నువ్వు ఎంతో హెచ్చించబడ్డావు.+ 10  యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి.+తన విశ్వసనీయుల ప్రాణాల్ని ఆయన కాపాడుతున్నాడు;+ దుష్టుల చేతి* నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.+ 11  నీతిమంతుల కోసం వెలుగు,హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్ల కోసం సంతోషం ప్రకాశించాయి.+ 12  నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి,ఆయన పవిత్రమైన పేరుకు* కృతజ్ఞతలు తెలపండి.

అధస్సూచీలు

లేదా “ఆరాధించండి.”
అక్ష., “కూతుళ్లు.”
లేదా “సర్వోన్నతుడివి.”
లేదా “శక్తి.”
అక్ష., “జ్ఞాపకార్థానికి.”