కీర్తనలు 110:1-7

  • మెల్కీసెదెకు లాంటి రాజు, యాజకుడు

    • ‘నీ శత్రువుల మధ్య పరిపాలించు’ (2)

    • ఇష్టపూర్వకంగా వచ్చే యౌవనులు మంచు బిందువులు (3)

దావీదు కీర్తన. శ్రావ్యగీతం. 110  యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు+నా కుడిపక్కన కూర్చో.”+   యెహోవా సీయోనులో నుండి నీ శక్తివంతమైన రాజదండాన్ని చాపి, “నీ శత్రువుల మధ్య జయిస్తూ వెళ్లు” అంటాడు.+   నువ్వు యుద్ధానికి సిద్ధపడే* రోజున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు. నీ యౌవనులు అరుణోదయ గర్భం నుండి, తేజోవంతమైన పవిత్రతతోమంచు బిందువుల్లా నీ దగ్గరికి వస్తారు.   “నువ్వు మెల్కీసెదెకు లాంటి యాజకుడివి, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు!”+ అని యెహోవా ఒట్టేసి ప్రమాణం చేశాడు, ఆయన తన మనసు మార్చుకోడు.*+   యెహోవా నీ కుడిపక్కన ఉంటాడు;+ఆయన కోపం చూపించే రోజున రాజుల్ని నలగ్గొడతాడు.+   ఆయన దేశాల మీద* తీర్పు అమలుచేస్తాడు;దేశాన్ని శవాలతో నింపుతాడు. విశాలమైన దేశ* నాయకుణ్ణి చితగ్గొడతాడు.   ఆయన* దారి పక్కనున్న వాగులో నీళ్లు తాగుతాడు. కాబట్టి ఆయన తన తలను పైకెత్తి ఉంచుతాడు.

అధస్సూచీలు

లేదా “సైన్యాన్ని నడిపించే.”
లేదా “విచారపడడు.”
లేదా “మధ్య.”
లేదా “భూమంతటి.”
1వ వచనంలోని “నా ప్రభువును” సూచిస్తుంది.