కీర్తనలు 76:1-12

  • సీయోను శత్రువులపై దేవుని విజయం

    • దేవుడు సాత్వికుల్ని కాపాడతాడు (9)

    • శత్రువుల గర్వాన్ని అణచివేస్తాడు (12)

సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. ఆసాపు+ శ్రావ్యగీతం. గీతం. 76  యూదాలో ఉన్నవాళ్లకు దేవుడు తెలుసు;+ఇశ్రాయేలులో ఆయన పేరు గొప్పది.+   షాలేములో+ ఆయన గుడారం,సీయోనులో ఆయన నివాసం ఉన్నాయి.+   అక్కడ ఆయన అగ్ని బాణాల్ని,డాలును, ఖడ్గాన్ని, యుద్ధ ఆయుధాల్ని విరగ్గొట్టాడు.+ (సెలా)   నువ్వు తేజోవంతంగా ప్రకాశిస్తున్నావు;*నీ మహిమ అడవి జంతువులు తిరిగే పర్వతాల కన్నా గొప్పది.   గుండె ధైర్యం గలవాళ్లు దోచుకోబడ్డారు.+ వాళ్లు మరణనిద్రలోకి జారుకున్నారు;యోధులందరూ చేతకానివాళ్లయ్యారు.+   యాకోబు దేవా, నువ్వు గద్దించినప్పుడుగుర్రంతో పాటు రథసారథి గాఢనిద్రలోకి జారుకున్నాడు.+   నువ్వు మాత్రమే సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుడివి.+ నీ తీవ్రమైన కోపాన్ని ఎవరు తట్టుకోగలరు?+   పరలోకం నుండి నువ్వు తీర్పును ప్రకటించావు;+భూమి భయపడి మౌనంగా ఉండిపోయింది.+   అప్పుడు దేవుడు భూమ్మీది సాత్వికులందర్నీ కాపాడడానికి+తీర్పు అమలుచేయాలని లేచాడు. (సెలా) 10  ఎందుకంటే, మనిషి కోపం నీకు స్తుతిని తీసుకొస్తుంది;+వాళ్ల మిగిలిన కోపంతో నిన్ను నువ్వు అలంకరించుకుంటావు. 11  మీ దేవుడైన యెహోవాకు మొక్కుబళ్లు చేసుకొని, వాటిని చెల్లించండి,+ఆయన చుట్టు ఉన్నవాళ్లంతా భయభక్తులతో కానుకలు తీసుకురావాలి.+ 12  నాయకుల గర్వాన్ని ఆయన అణచివేస్తాడు;భూరాజుల్లో భయం పుట్టిస్తాడు.

అధస్సూచీలు

లేదా “నీ చుట్టూ వెలుగు ఆవరించి ఉంది.”