కీర్తనలు 61:1-8
-
దేవుడు, శత్రువుల నుండి కాపాడే బలమైన బురుజు
-
‘నేను నీ గుడారంలో అతిథిగా ఉంటాను’ (4)
-
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. దావీదు కీర్తన.
61 దేవా, సహాయం కోసం నేను పెట్టే మొర విను.
నా ప్రార్థన ఆలకించు.+
2 నా హృదయం కృంగిపోయినప్పుడు,*భూమి అంచుల నుండి నేను నీకు మొరపెడతాను.+
నా కన్నా ఎత్తుగా ఉన్న బండ మీదికి నన్ను తీసుకెళ్లు.+
3 ఎందుకంటే నువ్వే నా ఆశ్రయం,శత్రువు నుండి నన్ను కాపాడే బలమైన బురుజు నువ్వే.+
4 నేను ఎప్పటికీ నీ గుడారంలో అతిథిగా ఉంటాను;+నీ రెక్కల చాటున ఆశ్రయం పొందుతాను.+ (సెలా)
5 దేవా, నువ్వు నా మొక్కుబళ్లను విన్నావు.
నీ పేరుకు భయపడేవాళ్లకు+ వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చావు.
6 నువ్వు రాజు ఆయుష్షును పొడిగిస్తావు,+అతను తరతరాలపాటు జీవిస్తాడు.
7 అతను దేవుని ముందు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చొనివుంటాడు;*+నీ విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని అతనికి దయచేయి,* అవి అతన్ని కాపాడతాయి.+
8 అప్పుడు నేను ప్రతీరోజు నా మొక్కుబళ్లు చెల్లిస్తూ,+నిరంతరం నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.*+
అధస్సూచీలు
^ లేదా “బలహీనపడినప్పుడు.”
^ లేదా “ఎప్పటికీ నివసిస్తాడు.”
^ లేదా “నియమించు.”
^ లేదా “సంగీతం వాయిస్తాను.”