కీర్తనలు 133:1-3

  • ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం

    • అహరోను తలమీద పోయబడిన తైలంలా (2)

    • హెర్మోను మంచులా (3)

యాత్ర కీర్తన. దావీదుది. 133  చూడండి! సహోదరులు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడంఎంత మంచిది! ఎంత మనోహరమైనది!+  2  అది, తలమీద పోయబడి+గడ్డం మీదుగా,అంటే అహరోను గడ్డం మీదుగా+అతని వస్త్రాల మెడపట్టీ* మీదికి కారే శ్రేష్ఠమైన తైలంలా ఉంటుంది.  3  అది సీయోను పర్వతాల+ మీదికి దిగివచ్చేహెర్మోను+ మంచులా ఉంటుంది. అక్కడ తన దీవెన, అంటే శాశ్వత జీవితం ఉండాలనియెహోవా ఆజ్ఞాపించాడు.

అధస్సూచీలు

లేదా “గల్లా; కాలర్‌.”