కీర్తనలు 21:1-13
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం.
21 యెహోవా, నీ బలాన్ని బట్టి రాజు ఉల్లసిస్తున్నాడు;+నీ రక్షణ కార్యాల్ని బట్టి అతను ఎంతో ఉల్లసిస్తున్నాడు!+
2 నువ్వు అతని హృదయ కోరికను తీర్చావు,+అతని పెదాల విన్నపాన్ని కాదనలేదు. (సెలా)
3 నువ్వు అతన్ని ఆశీర్వదించి, మంచివాటిని అతనికి ఇచ్చావు;అతని తల మీద మేలిమి* బంగారు కిరీటాన్ని పెట్టావు.+
4 అతను నిన్ను ఆయుష్షు ఇవ్వమని అడిగాడు,నువ్వు అతనికి దీర్ఘాయుష్షును, శాశ్వత జీవితాన్ని ఇచ్చావు.+
5 నీ రక్షణ కార్యాలు అతనికి ఎంతో మహిమను తీసుకొస్తాయి.+
ఘనతను, వైభవాన్ని నువ్వు అతనికి అనుగ్రహిస్తావు.
6 అతను ఎప్పటికీ దీవించబడేలా చేస్తావు;+నీ సన్నిధిలో అతన్ని ఆనందింపజేస్తావు.+
7 ఎందుకంటే, రాజు యెహోవా మీద నమ్మకముంచాడు;+సర్వోన్నతుని విశ్వసనీయ ప్రేమను బట్టి, అతను ఎన్నడూ కదల్చబడడు.*+
8 నీ చెయ్యి నీ శత్రువులందర్నీ పట్టుకుంటుంది;నీ కుడిచెయ్యి నిన్ను ద్వేషించేవాళ్లను పట్టుకుంటుంది.
9 నువ్వు వాళ్లమీద దృష్టిపెట్టే సమయంలో వాళ్లను అగ్నితో నాశనం చేస్తావు.
యెహోవా తన కోపంతో వాళ్లను మింగేస్తాడు, అగ్ని వాళ్లను దహించేస్తుంది.+
10 నువ్వు భూమ్మీద లేకుండా వాళ్ల వంశస్థుల్ని నాశనం చేస్తావు,మనుషుల్లో నుండి వాళ్ల సంతానాన్ని నిర్మూలిస్తావు.
11 వాళ్లు నీకు కీడు చేయాలనుకున్నారు;+వాళ్లు పన్నాగాలు పన్నారు, కానీ అవి ఫలించవు.+
12 నువ్వు నీ విల్లును వాళ్ల* మీదికి ఎక్కుపెట్టి,
వాళ్లు పారిపోయేలా చేస్తావు.+
13 యెహోవా, లేచి నీ బలాన్ని చూపించు.
నీ గొప్ప శక్తిని స్తుతిస్తూ మేము పాటలు పాడతాం.*

