కీర్తనలు 141:1-10

  • రక్షించమని ప్రార్థన

    • ‘నా ప్రార్థన ధూపంలా ఉండాలి’ (2)

    • నీతిమంతుడి గద్దింపు తైలం లాంటిది (5)

    • దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు (10)

దావీదు శ్రావ్యగీతం. 141  యెహోవా, నీకు ప్రార్థిస్తున్నాను.+ త్వరగా వచ్చి నాకు సహాయం చేయి.+ నేను నీకు మొరపెట్టినప్పుడు శ్రద్ధగా ఆలకించు.+   నా ప్రార్థన, నీ ముందు బాగా సిద్ధం చేసిన ధూపంలా+ ఉండాలి;+నేను చేతులు ఎత్తడం, సాయంకాల ధాన్యార్పణలా ఉండాలి.+   యెహోవా, నా నోటికి కాపలా పెట్టు,నా పెదాల ద్వారం దగ్గర కాపలావాణ్ణి నియమించు.+   నా హృదయాన్ని చెడ్డవాటి వైపు మొగ్గుచూపనివ్వకు,+నన్ను చెడ్డవాళ్లతో పాటు నీచమైన పనుల్లో పాల్గొననివ్వకు;వాళ్ల రుచిగల ఆహారపదార్థాల్ని నేను ఎప్పటికీ ఆస్వాదించకూడదు.   నీతిమంతుడు నన్ను కొడితే, నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించినట్టే;+అతను నన్ను గద్దిస్తే, నా తలమీద సేదదీర్చే తైలం పోసినట్టే,+నా తల ఎప్పటికీ దాన్ని వద్దనదు.+ వాళ్లకు విపత్తులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉంటాను.   వాళ్ల న్యాయమూర్తులు కొండ అంచు నుండి కిందికి పడేయబడినా,ప్రజలు నా మాటల మీద శ్రద్ధ పెడతారు, ఎందుకంటే అవి ఆహ్లాదకరమైనవి.   ఒక వ్యక్తి నేలను దున్ని చీల్చినట్టు,మా ఎముకలు సమాధి* దగ్గర చెల్లాచెదురుగా పడివున్నాయి.   అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నా కళ్లు నీ వైపే చూస్తున్నాయి.+ నేను నిన్నే ఆశ్రయంగా చేసుకున్నాను. నా ప్రాణం తీసేయకు.   వాళ్లు నా కోసం పెట్టిన ఉచ్చు నుండి,చెడ్డవాళ్ల ఉరుల్లో నుండి నన్ను కాపాడు. 10  దుష్టులంతా తమ వలల్లో తామే చిక్కుకుంటారు,+అయితే నేను సురక్షితంగా దాటివెళ్తాను.

అధస్సూచీలు

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.