7వ ప్రశ్న
మన కాలం గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?
“ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి . . . ఇవన్నీ పురిటినొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.”
“చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి, ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు; చెడుతనం పెరిగిపోవడం వల్ల ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.”
“మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి విన్నప్పుడు కంగారుపడకండి; ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు.”
“తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి. భయంకరమైన దృశ్యాలు, ఆకాశంలో గొప్ప సూచనలు కనిపిస్తాయి.”
“చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు, పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.”