కీర్తనలు 113:1-9
113 యెహోవాను* స్తుతించండి!*
యెహోవా సేవకులారా, స్తుతులు చెల్లించండి,యెహోవా పేరును స్తుతించండి.
2 ఇప్పటినుండి సదాకాలంయెహోవా పేరు స్తుతించబడాలి.+
3 సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకుయెహోవా పేరు స్తుతించబడాలి.+
4 యెహోవా అన్ని దేశాలకు పైన ఎంతో ఉన్నతుడిగా ఉన్నాడు;+ఆయన మహిమ ఆకాశానికి పైగా ఉంది.+
5 ఉన్నత స్థలంలో నివసించే*మన దేవుడైన యెహోవా లాంటివాళ్లు ఎవరు?+
6 ఆయన భూమ్యాకాశాల్ని వంగి చూస్తాడు.+
7 దీనుల్ని మట్టిలో నుండి పైకి ఎత్తుతాడు.
పేదవాళ్లను బూడిద కుప్ప* నుండి పైకి లేపి,+
8 ప్రముఖులతో పాటు,తన ప్రజల్లోని ప్రముఖులతో పాటు కూర్చోబెడతాడు.
9 ఆయన గొడ్రాలినిఇంట్లో పిల్లలున్న* సంతోషంగల తల్లిగా చేస్తాడు.+
యెహోవాను* స్తుతించండి!*

