కీర్తనలు 138:1-8
దావీదు కీర్తన.
138 నా నిండు హృదయంతో నేను నిన్ను స్తుతిస్తాను.+
ఇతర దేవుళ్ల ముందునిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.*
2 నీ పవిత్ర ఆలయం* వైపు వంగి నమస్కారం చేస్తాను,+నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టినీ పేరును స్తుతిస్తాను.+
ఎందుకంటే నువ్వు నీ మాటను, నీ పేరును మిగతా వాటన్నిటికి పైగా హెచ్చించావు.*
3 నేను నీకు మొరపెట్టిన రోజున నువ్వు నాకు జవాబిచ్చావు;+నాలో ధైర్యాన్ని, బలాన్ని నింపావు.+
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతిస్తారు,+ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాల్ని వాళ్లు వినివుంటారు.
5 వాళ్లు యెహోవా మార్గాల గురించి పాడతారు,ఎందుకంటే యెహోవా మహిమ గొప్పది.+
6 యెహోవా ఉన్నతుడైనా, వినయస్థుల్ని గమనిస్తాడు,+అయితే గర్విష్ఠులు ఆయనకు దూరం నుండి మాత్రమే తెలుసు.+
7 నేను అపాయంలో ఉన్నా, నువ్వు నన్ను సజీవంగా కాపాడతావు.+
నా శత్రువుల కోపానికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపుతావు;నీ కుడిచెయ్యి నన్ను రక్షిస్తుంది.
8 యెహోవా నా పక్షాన అన్ని పనులూ పూర్తిచేస్తాడు.
యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది;+నీ చేతిపనుల్ని విడిచిపెట్టకు.+
అధస్సూచీలు
^ లేదా “ఇతర దేవుళ్లకు వ్యతిరేకంగా నీకు సంగీతం వాయిస్తాను” అయ్యుంటుంది.
^ లేదా “పవిత్రమైన స్థలం.”
^ లేదా “నీ పేరు అంతటికి పైగా నీ మాటను హెచ్చించావు” అయ్యుంటుంది.