కీర్తనలు 131:1-3

  • పాలు మానేసిన పిల్లాడిలా సంతృప్తిగా ఉండడం

    • గొప్పగొప్ప వాటి కోసం పాకులాడలేదు (1)

యాత్ర కీర్తన. దావీదుది. 131  యెహోవా, నా హృదయానికి పొగరెక్కలేదు,నా కళ్లు నెత్తికెక్కలేదు;+గొప్పగొప్ప వాటి కోసం,నా శక్తికి మించిన వాటి కోసం నేను పాకులాడలేదు.+   బదులుగా, పాలు మానేసిన బిడ్డ తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టునా ప్రాణాన్ని* నేను సముదాయించి ఊరుకోబెట్టాను;+పాలు మానేసిన పిల్లాడిలా నేను సంతృప్తిగా ఉన్నాను.   ఇప్పటినుండి సదాకాలంఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురుచూడాలి.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.