కీర్తనలు 63:1-11

  • దేవుని కోసం తపించడం

    • “నీ విశ్వసనీయ ప్రేమ జీవం కంటే ఉత్తమం” (3)

    • ‘శ్రేష్ఠమైన వాటితో నా ప్రాణం తృప్తి పొందింది’ (5)

    • రాత్రివేళ దేవుని గురించి ధ్యానించడం (6)

    • ‘నేను దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటాను’ (8)

దావీదు శ్రావ్యగీతం. దావీదు యూదా ఎడారిలో ఉన్నప్పటిది.+ 63  దేవా, నువ్వే నా దేవుడివి, నేను నీ కోసం చూస్తూ ఉంటాను.+ నా ప్రాణం నీ కోసం దప్పికతో ఉంది.+ ఎండిపోయి నిర్జీవంగా ఉన్న నీళ్లులేని దేశంలోనీ కోసం తపిస్తూ నేను మూర్ఛపోయాను.+   అప్పుడు నేను పవిత్ర స్థలంలో నిన్ను చూశాను;నీ బలాన్ని, నీ మహిమను చూశాను.+   నీ విశ్వసనీయ ప్రేమ జీవం కంటే ఉత్తమం,+అందుకే నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.   నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను;చేతులెత్తి నీ పేరున ప్రార్థిస్తాను.   శ్రేష్ఠమైన వాటితో, కొవ్విన వాటితో నా ప్రాణం తృప్తి పొందింది,అందుకే సంతోష స్వరంతో నిన్ను స్తుతిస్తాను.+   పడక మీద ఉన్నప్పుడు నేను నిన్ను గుర్తుచేసుకుంటాను;రాత్రి జాముల్లో నీ గురించి ధ్యానిస్తాను.   ఎందుకంటే, నువ్వే నాకు సహాయకుడివి,+నీ రెక్కల చాటున నేను సంతోషంతో కేకలు వేస్తాను.+   నేను నిన్ను అంటిపెట్టుకొని ఉంటాను;నీ కుడిచెయ్యి నన్ను గట్టిగా పట్టుకుని ఉంటుంది.+   అయితే నా ప్రాణం తీయాలని చూసేవాళ్లుభూమి లోతుల్లోకి దిగిపోతారు. 10  వాళ్లు కత్తి చేత చంపబడతారు;నక్కలకు ఆహారమౌతారు. 11  అయితే రాజు దేవుణ్ణి బట్టి సంతోషిస్తాడు.ఆయన తోడని ప్రమాణం చేసే ప్రతీ వ్యక్తి ఉల్లసిస్తాడు,* ఎందుకంటే అబద్ధాలాడేవాళ్ల నోళ్లు మూతపడతాయి.

అధస్సూచీలు

లేదా “ఆయన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటాడు.”