కీర్తనలు 150:1-6
150 యెహోవాను* స్తుతించండి!*+
తన పవిత్ర స్థలంలో దేవుణ్ణి స్తుతించండి.+
ఆయన బలానికి నిదర్శనంగా ఉన్న* ఆకాశంలో* ఆయన్ని స్తుతించండి.+
2 ఆయన శక్తివంతమైన పనుల్ని బట్టి ఆయన్ని స్తుతించండి.+
ఆయన సాటిలేని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతించండి.+
3 బూర* ఊదుతూ+ ఆయన్ని స్తుతించండి.
తంతివాద్యంతో, వీణతో*+ ఆయన్ని స్తుతించండి.
4 కంజీర* పట్టుకొని+ నాట్యం* చేస్తూ ఆయన్ని స్తుతించండి.
తంతివాద్యాలతో, పిల్లనగ్రోవితో*+ ఆయన్ని స్తుతించండి.+
5 మోగే తాళాలతో ఆయన్ని స్తుతించండి.
పెద్ద శబ్దం చేసే తాళాలతో+ ఆయన్ని స్తుతించండి.
6 ఊపిరి తీసుకునే ప్రతీ ప్రాణి యెహోవాను* స్తుతించాలి.
యెహోవాను* స్తుతించండి!*+
అధస్సూచీలు
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”
^ లేదా “బలం గురించి సాక్ష్యం చెప్పే.”
^ లేదా “విశాలంలో.”
^ అక్ష., “కొమ్ము.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అంటే, గిలకల తప్పెట.
^ లేదా “గుండ్రంగా తిరుగుతూ నాట్యం.”
^ లేదా “సన్నాయితో.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”