కీర్తనలు 121:1-8

  • యెహోవా తన ప్రజల్ని సంరక్షిస్తాడు

    • “యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది” (2)

    • యెహోవా అస్సలు నిద్రపోడు (3, 4)

యాత్ర కీర్తన. 121  నేను పర్వతాల+ వైపు తల ఎత్తి చూస్తున్నాను. నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది?   భూమ్యాకాశాల్ని చేసినయెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.+   ఆయన నీ పాదాన్ని ఎప్పుడూ ​జారనివ్వడు.*+ నిన్ను కాపాడుతున్న దేవుడు అస్సలు కునకడు.   ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడుఅస్సలు కునకడు, నిద్రపోడు.+   యెహోవాయే నిన్ను కాపాడుతున్నాడు. యెహోవా నీ కుడిపక్కన+ సంరక్షించే నీడలా ఉన్నాడు.+   పగలు ఎండ* దెబ్బ గానీ,రాత్రి వెన్నెల* దెబ్బ గానీ నీకు తగలదు.+   యెహోవా నీకు ఏ హానీ జరగకుండా కాపాడతాడు.+ ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు.+   ఇప్పటినుండి సదాకాలంనీ రాకపోకలన్నిట్లో* యెహోవా నిన్ను కాపాడతాడు.

అధస్సూచీలు

లేదా “తడబడనివ్వడు.”
అక్ష., “సూర్యుడి.”
అక్ష., “చంద్రుడి.”
లేదా “నువ్వు చేసే ప్రతీపనిలో.”