కీర్తనలు 27:1-14

  • యెహోవా నా ప్రాణ దుర్గం

    • దేవుని ఆలయం పట్ల కృతజ్ఞతా భావం (4)

    • తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా యెహోవా పట్టించుకుంటాడు (10)

    • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి” (14)

దావీదు కీర్తన. 27  యెహోవా నా వెలుగు,+ నా రక్షణ. నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి?+ యెహోవాయే నా ప్రాణ దుర్గం.+ నేను ఎవరికైనా ఎందుకు బెదరాలి?   నా శరీరాన్ని నాశనం చేయడానికి చెడ్డవాళ్లు నా మీద దాడిచేసినప్పుడు,+నా విరోధులూ శత్రువులే తొట్రిల్లి పడిపోయారు.   సైన్యం నన్ను చుట్టుముట్టినా,నా హృదయం భయపడదు.+ నా మీదికి యుద్ధమే వచ్చినా,నేను ధైర్యంగానే ఉంటాను.   నేను యెహోవాను ఒకటి అడిగాను,దాని కోసమే ఎదురుచూస్తాను, అదేమిటంటేయెహోవా మంచితనాన్ని* చూస్తూ ఉండేలాఆయన ఆలయాన్ని* సంతోషంతో* చూసేలా+నేను జీవించినంత కాలం యెహోవా మందిరంలో నివసించాలి.+   ఎందుకంటే, విపత్తు రోజున ఆయన నన్ను తన ఆశ్రయంలో దాస్తాడు;+తన గుడారంలోని రహస్య స్థలంలో నన్ను దాచిపెడతాడు;నన్ను ఎత్తైన బండ మీద ఉంచుతాడు.+   నన్ను చుట్టుముట్టిన నా శత్రువుల కన్నా నా తల ఎత్తుగా ఉంది;నేను ఆనందంగా కేకలు వేస్తూ ఆయన గుడారం దగ్గర బలులు అర్పిస్తాను;నేను యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడతాను.*   యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించు;+నా మీద అనుగ్రహం చూపించి నాకు జవాబివ్వు.+   “నా కోసం వెదకండి” అని నువ్వు ఆజ్ఞాపించావని నా హృదయం చెప్పింది. యెహోవా, నేను నీ కోసం వెదుకుతాను.+   నీ ముఖాన్ని నాకు దాచకు.+ కోపంతో నీ సేవకుణ్ణి పంపించేయకు. నువ్వే నా సహాయకుడివి;+నా రక్షకుడివైన దేవా, నన్ను విడిచిపెట్టకు, వదిలేయకు. 10  నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టినా,+యెహోవా నన్ను చేరదీస్తాడు.+ 11  యెహోవా, నీ మార్గాన్ని నాకు ఉపదేశించు,+నా శత్రువుల్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు. 12  నా శత్రువులకు నన్ను అప్పగించకు,+ఎందుకంటే అబద్ధ సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు,+వాళ్లు నాకు హాని చేయాలనుకుంటున్నారు. 13  సజీవుల దేశంలో యెహోవా మంచితనాన్ని చూస్తాననే నమ్మకం నాకు లేకపోతే,నేను ఎక్కడ ఉండేవాణ్ణి?*+ 14  యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి;+ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి.+ అవును, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి.

అధస్సూచీలు

లేదా “సౌందర్యాన్ని.”
లేదా “పవిత్రమైన స్థలాన్ని.”
లేదా “కృతజ్ఞతతో.”
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది” అయ్యుంటుంది.