కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

26వ పాఠం

చెడుతనం, బాధలు ఎందుకు ఉన్నాయి?

చెడుతనం, బాధలు ఎందుకు ఉన్నాయి?

ఏదైనా చెడు జరిగినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు, “ఎందుకు ఇలా జరుగుతోంది?” అనే ప్రశ్న రావడం మామూలే. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆ ప్రశ్నకు బైబిల్లో స్పష్టమైన జవాబు ఉంది!

1. సాతాను ఎలా లోకంలోకి చెడుతనాన్ని తీసుకొచ్చాడు?

అపవాది అయిన సాతాను దేవునికి ఎదురుతిరిగాడు. అతను అధికారం కావాలని కోరుకున్నాడు, అందుకే మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని దేవునికి ఎదురుతిరిగేలా చేశాడు. సాతాను హవ్వతో ఒక అబద్ధం చెప్పడం ద్వారా అలా చేశాడు. (ఆదికాండం 3:1-5) యెహోవా కావాలనే ఏదో మంచిని దక్కకుండా చేస్తున్నాడని, మనుషులు దేవుని మాట వినకపోతేనే ఇంకా సంతోషంగా ఉంటారని హవ్వ అనుకునేలా సాతాను మాట్లాడాడు. పండు తిన్నా చనిపోరని సాతాను హవ్వకు మొదటి అబద్ధం చెప్పాడు. కాబట్టి, బైబిలు సాతానును “అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి” అని పిలుస్తుంది.—యోహాను 8:44.

2. ఆదాముహవ్వలు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు?

యెహోవా ఆదాముహవ్వలకు ఏ లోటూ లేకుండా కావల్సినవన్నీ ఇచ్చాడు. వాళ్లు ఒక్క చెట్టువి తప్ప ఏదెను తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లను తినొచ్చని చెప్పాడు. (ఆదికాండం 2:15-17) కానీ, దేవుడు ఏదైతే తినొద్దు అని చెప్పాడో దాన్నే తినాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. హవ్వ ‘ఆ చెట్టు పండును తీసుకొని తినడం మొదలుపెట్టింది,’ తర్వాత ఆదాము కూడా ‘దాన్ని తిన్నాడు.’ (ఆదికాండం 3:6) వాళ్లిద్దరూ దేవుని మాట వినలేదు. నిజానికి ఆదాముహవ్వలు పరిపూర్ణులు, అంటే ఏ లోపం లేనివాళ్లు. కాబట్టి సరైనది చేయాలనే ఆలోచన వాళ్లలో సహజంగానే ఉంటుంది. అయినా వాళ్లు కావాలనే దేవుని మాట వినకుండా పాపం చేశారు, దేవుని పరిపాలన తమకు అక్కర్లేదని చూపించారు. వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఎన్నో బాధల్ని కొనితెచ్చుకున్నారు.—ఆదికాండం 3:16-19.

3. ఆదాముహవ్వలు తీసుకున్న నిర్ణయం వల్ల మనకు ఏం జరిగింది?

ఆదాముహవ్వలు పాపం చేయడం వల్ల అపరిపూర్ణులు అయ్యారు. అంతేకాదు, ఆ అపరిపూర్ణత వాళ్ల పిల్లలమైన మనందరికీ వారసత్వంగా వచ్చింది. ఆదాము గురించి బైబిలు ఇలా చెప్తుంది: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. . . . కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”రోమీయులు 5:12.

మన బాధలకు చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల బాధలు పడతాం. ఇంకొన్నిసార్లు, వేరేవాళ్లు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల బాధలు పడతాం. మరికొన్నిసార్లు, మనం అనుకోని సమయంలో అనుకోని చోట ఉండడం వల్ల కూడా బాధలు పడతాం.—ప్రసంగి 9:11 చదవండి.

ఎక్కువ తెలుసుకోండి

ఇప్పుడు లోకంలో ఉన్న చెడుకు, బాధలకు దేవుడు ఎందుకు కారణం కాదో, అలాగే మనం పడే బాధలు చూసి ఆయనకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి.

4. మన బాధలకు కారణం ఎవరు?

దేవుడే ఈ లోకమంతటినీ పరిపాలిస్తున్నాడని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజమేనా? వీడియో చూడండి.

యాకోబు 1:13; 1 యోహాను 5:19 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • లోకంలో ఉన్న బాధలకు, చెడుకు కారణం దేవుడా?

5. సాతాను పరిపాలన వల్ల వచ్చిన నష్టాలు

ఆదికాండం 3:1-6 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • సాతాను చెప్పిన అబద్ధం ఏంటి?—4, 5 వచనాలు చూడండి.

  • యెహోవా మనుషులకు ఏదో మంచిని దక్కకుండా చేస్తున్నాడని అనుకునేటట్టు సాతాను ఎలా మాట్లాడాడు?

  • మనుషులు సంతోషంగా ఉండాలంటే వాళ్లకు దేవుని పరిపాలన అవసరం లేదన్నట్టు సాతాను ఎలా మాట్లాడాడు?

ప్రసంగి 8:9 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనుషులు యెహోవా పరిపాలనను వద్దనుకోవడం వల్ల ఏం జరిగింది?

  1. 1. ఆదాము, హవ్వ పరిపూర్ణులు. వాళ్లు పరదైసులో, అంటే అందమైన తోటలో జీవించారు. కానీ వాళ్లు సాతాను మాట విని యెహోవాకు ఎదురుతిరిగారు

  2. 2. దానివల్ల మనుషులందరికీ పాపం, బాధలు, మరణం వచ్చాయి

  3. 3. యెహోవా పాపాన్ని, బాధల్ని, మరణాన్ని తీసేస్తాడు. మళ్లీ మనుషులు పరిపూర్ణులౌతారు, పరదైసులో జీవిస్తారు

6. యెహోవా మన బాధల్ని పట్టించుకుంటాడు

దేవుడు మన బాధల్ని పట్టించుకుంటాడా? రాజైన దావీదు, అపొస్తలుడైన పేతురు ఏం రాశారో చూడండి. కీర్తన 31:7; 1 పేతురు 5:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా మన బాధలు చూస్తాడని, పట్టించుకుంటాడని తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

7. మనుషుల బాధలన్నిటినీ దేవుడు తీసేస్తాడు

యెషయా 65:17; ప్రకటన 21:3, 4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనుషుల బాధలన్నిటినీ, వాటివల్ల జరిగిన నష్టమంతటినీ యెహోవా తీసేస్తాడు అని తెలుసుకోవడం ఎందుకు ఓదార్పును ఇస్తుంది?

మీకు తెలుసా?

సాతాను మొదటి అబద్ధం చెప్తున్నప్పుడు, యెహోవా మీద నిందలు వేశాడు. యెహోవా మంచి పరిపాలకుడు కాదని, ఆయనకు ప్రేమ లేదని చెప్తూ సాతాను ఆయన పేరును పాడుచేశాడు. అయితే యెహోవా త్వరలోనే మనుషుల బాధలన్నిటినీ తీసేసి, తన పేరును పవిత్రపర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే తాను మంచి పరిపాలకుణ్ణని, తన పరిపాలనే సరైనదని రుజువు చేసుకుంటాడు. యెహోవా పేరు పవిత్రమవ్వడమే ఈ విశ్వం మొత్తంలో చాలా ముఖ్యమైన విషయం.—మత్తయి 6:9, 10.

కొంతమంది ఇలా అంటారు: “దేవుడు మనల్ని పరీక్షించడానికే బాధలు పెడతాడు.”

  • మరి, మీరేమంటారు?

ఒక్కమాటలో

లోకంలో ఉన్న చెడుకు ముఖ్య కారణం అపవాది అయిన సాతాను, ఆదాముహవ్వలు. యెహోవా మన బాధల్ని నిజంగా పట్టించుకుంటాడు, త్వరలోనే వాటన్నిటినీ తీసేస్తాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • అపవాది అయిన సాతాను హవ్వకు ఏ అబద్ధం చెప్పాడు?

  • ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరగడం వల్ల మనందరికీ ఏం జరిగింది?

  • యెహోవా మన బాధల్ని పట్టించుకుంటాడని మనకెలా తెలుసు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

పాపం గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

“పాపం అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)

ఏదెను తోటలో, అపవాది అయిన సాతాను దేవుని మీద వేసిన నింద గురించి ఎక్కువ తెలుసుకోండి.

“దేవుడు బాధల్ని ఎందుకు తీసేయట్లేదు?” (కావలికోట ఆర్టికల్‌)

కొందర్ని కలవరపెట్టిన ప్రశ్నకు ఓదార్పును ఇచ్చే జవాబులు చూడండి.

“మారణహోమం ఎందుకు జరిగింది? దేవుడు దాన్ని ఎందుకు ఆపలేదు?” (jw.org ఆర్టికల్‌)

తన చుట్టూ ఉన్న బాధల గురించి ఒకాయన ఏం తెలుసుకున్నాడో గమనించండి.

నేను ఇక ఏమాత్రం ఒంటరివాణ్ణి కాదు (5:09)