కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?

యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?

 బైబిలు బోధించేవాటిని మీరు నేర్చుకోవడానికి యెహోవాసాక్షులు ఒక సమర్థవంతమైన పద్ధతి రూపొందించారు. మా బైబిలు స్టడీ ప్రోగ్రామ్‌ మీకు ఈ విషయాల్లో సహాయం చేస్తుంది:

  •   సంతోషంగా జీవించడానికి

  •   దేవునికి స్నేహితులు అవ్వడానికి

  •   భవిష్యత్తు గురించి బైబిల్లో ఉన్న వాగ్దానాలు తెలుసుకోవడానికి

ఈ పేజీలో

 బైబిలు స్టడీ ఎలా ఉంటుంది?

 ఒక యెహోవాసాక్షి బైబిల్లోని ఒక్కో అంశాన్ని నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తారు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బైబిలు కోర్సు ఉపయోగిస్తూ మీరు క్రమక్రమంగా బైబిల్లో ఏముందో, అది మీకు ఎలా సహాయం చేస్తుందో నేర్చుకుంటారు. ఇంకా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

 స్టడీ కోసం నేను డబ్బులు ఇవ్వాలా?

 అవసరం లేదు. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.” యెహోవాసాక్షులు ఆ నిర్దేశాన్ని పాటిస్తారు. (మత్తయి 10:8) అంతేకాదు, ఈ కోర్సు కోసం అవసరమయ్యే వాటిని అంటే ఒక బైబిల్ని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని కూడా మీరు ఉచితంగా పొందవచ్చు.

 కోర్సు ఎంత కాలం ఉంటుంది?

 మొత్తం కోర్సులో 60 పాఠాలు ఉంటాయి. వాటిని ఎంత సమయంలో పూర్తి చేస్తారనేది మీ ఇష్టం. చాలామంది వారానికి ఒకటి లేదా రెండు పాఠాలు స్టడీ చేయడానికి ఇష్టపడతారు.

 నేను ఎలా మొదలుపెట్టాలి?

  1.  1. ఆన్‌లైన్‌ ఫారమ్‌ నింపండి. మీరు ఇచ్చే వ్యక్తిగత సమాచారం, మీ రిక్వెస్ట్‌ ప్రకారం ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని సంప్రదించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.

  2.  2. ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆయన/ఆమె బైబిలు కోర్సు ఎలా ఉంటుందో మీకు వివరిస్తారు, మీకు ఏవైనా ప్రశ్నలుంటే జవాబు చెప్తారు.

  3.  3. మీరిద్దరూ స్టడీ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. నేరుగా కలుసుకొని లేదా టెలిఫోన్‌, వీడియో కాల్‌, ఉత్తరాలు, ఈ-మెయిల్స్‌ ద్వారా స్టడీ చేసుకోవచ్చు. సాధారణంగా స్టడీ గంటసేపు ఉంటుంది, అయితే మీ వీలును బట్టి అంతకన్నా తక్కువసేపు లేదా ఎక్కువసేపు స్టడీ చేసుకోవచ్చు.

 స్టడీ ఎలా ఉంటుందో ముందే ఒకసారి చూపిస్తారా?

 చూపిస్తారు. అందుకోసం మీరు ఆన్‌లైన్‌ ఫారమ్‌ నింపండి. ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని సంప్రదించినప్పుడు, బైబిలు స్టడీ మీకు నచ్చుతుందో లేదో తెలుసుకోవడానికి ముందే ఒకసారి స్టడీ ఎలా ఉంటుందో చూపించమని అడగండి. ఆయన/ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్‌ ఉపయోగించి స్టడీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. స్టడీ పుస్తకంలోని మొదటి మూడు పాఠాలు ఆ బ్రోషుర్‌లో ఉంటాయి.

 నేను బైబిలు స్టడీకి ఒప్పుకుంటే, యెహోవాసాక్షి అవ్వమని నన్ను ఒత్తిడి చేస్తారా?

 లేదు. బైబిలు గురించి ప్రజలకు నేర్పించడం అంటే యెహోవాసాక్షులకు ఇష్టం, అయితే మా మతంలో చేరమని మేము ఎవ్వర్నీ ఒత్తిడి చేయం. మేము బైబిల్లో ఉన్న విషయాలను గౌరవపూర్వకంగా చెప్తాం, అయితే ఏది నమ్మాలో నిర్ణయించుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని గుర్తిస్తాం.—1 పేతురు 3:15.

 నేను నా బైబిలు ఉపయోగించవచ్చా?

 తప్పకుండా, మీకు నచ్చిన ఏ బైబిలైనా మీరు ఉపయోగించవచ్చు. స్పష్టంగా, ఖచ్చితంగా ఉండే పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఉపయోగించడం మాకు ఇష్టం, అయినా చాలామంది తమకు అలవాటైన బైబిల్ని ఉపయోగించడానికి ఇష్టపడతారని మాకు తెలుసు.

 స్టడీకి నేను వేరేవాళ్లను కూడా ఆహ్వానించవచ్చా?

 ఆహ్వానించవచ్చు. మీ కుటుంబం అంతటినీ, మీకు నచ్చిన స్నేహితుల్ని ఎవరినైనా మీరు ఆహ్వానించవచ్చు.

 నేను గతంలో యెహోవాసాక్షులతో స్టడీ చేసి ఉంటే, ఇప్పుడు మళ్లీ స్టడీ చేయవచ్చా?

 చేయవచ్చు. నిజానికి మీరు ప్రస్తుత బైబిలు కోర్సును ఇంకా ఎక్కువగా ఆనందిస్తారు, ఎందుకంటే దాన్ని ఇప్పటి ప్రజల అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దారు. గతంలో ఉన్న బైబిలు స్టడీ ప్రోగ్రామ్‌ల కన్నా దీనిలో ఎక్కువ చిత్రాలు-వీడియోలు ఉన్నాయి, ఎక్కువ చర్చా శైలిలో ఉంటుంది.

 ఎవరో ఒకరి దగ్గర కాకుండా వేరేవిధంగా నేను బైబిలు స్టడీ చేయవచ్చా?

 చేయవచ్చు. చాలామంది, యెహోవాసాక్షుల దగ్గర స్టడీ చేయడం ద్వారా బాగా నేర్చుకుంటారు. అయితే కొంతమంది మొదట్లో సొంతగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. “బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి” అనే పేజీలో, మీరు ఉచితంగా బైబిలు స్టడీ చేయడానికి ఉపయోగపడే ప్రచురణలు, పద్ధతులు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటంటే:

  •   ఆన్‌లైన్‌ బైబిల్‌ స్టడీ లెసన్స్‌. చర్చా శైలిలో ఉండే ఈ లెసన్స్‌ ద్వారా జీవితం గురించిన అత్యంత ముఖ్యమైన ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు: దేవుడు ఎవరు? బాధలు, దుష్టత్వం ఎందుకు ఉన్నాయి? దేవుడు ఎప్పటికైనా బాధలన్నీ తీసేస్తాడా?

  •   బైబిలు వీడియోలు. చిన్నగా ఉండే ఈ వీడియో-లెసెన్స్‌ ముఖ్యమైన బైబిలు బోధల్ని వివరిస్తాయి.

  •   బైబిలు ప్రశ్నలకు జవాబులు. ఈ ఆర్టికల్స్‌లో ఎన్నో బైబిలు ప్రశ్నలకు జవాబులు ఉంటాయి.

  •   బైబిలు వచనాల వివరణ. బైబిల్లో బాగా తెలిసిన వచనాల, పదబంధాల అర్థం తెలుసుకోండి.