యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు

యెహోవా దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఈ కొత్తపాటల్ని ఆనందంగా పాడండి. ఈ రమ్యమైన పాటల సంగీతాన్ని, పదకూర్పును డౌన్‌లోడ్‌ చేసుకుని పాటల్ని ప్రాక్టీసు చేయండి.

136వ పాట

రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!

ఈ దివ్యమైన రాజ్యగీతం, యేసుక్రీస్తు పరిపాలనను గుర్తిస్తూ యెహోవా దేవుణ్ణి స్తుతిస్తుంది.

137వ పాట

మాకు ధైర్యాన్నివ్వు

తన పేరు గురించి సాక్ష్యమివ్వడానికి ధైర్యాన్నివ్వమని యెహోవాకు చేసే విన్నపంలో మీరూ కలవండి.

138వ పాట

యెహోవా నీ పేరు

యెహోవా మహిమగల పేరును స్తుతించండి, ఆయనే మహోన్నతుడని ప్రజలందరికీ తెలపండి.

139వ పాట

వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

కాపాడమని, జీపపు పరుగు పందెంలో చివరిదాకా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని యెహోవాకు చేసే విన్నపం.

140వ పాట

పయినీరు జీవితం

యెహోవాపై మీకున్న ప్రేమ గురించి, సంతృప్తినిచ్చే మీ పనిలో ఉన్న ఆనందం గురించి, మీరు ఇష్టపడే జీవితం గురించి చెప్పండి.

141వ పాట

శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం

ప్రజలపై మనకున్న ప్రేమను, దేవుని అమూల్యమైన గొర్రెలను వెతకడానికి మనం చేసే కృషిని వర్ణిస్తూ ఉత్సాహంగా, ఆనందంగా పాడే పాట.

142వ పాట

అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

యెహోవా మంచితనం గురించి, ఆయనకు స్నేహితులయ్యేలా అన్ని రకాల ప్రజలను ఆహ్వానించడంలో మన పాత్ర గురించి పాడండి.

143వ పాట

చీకటి లోకంలో వెలుగు

చీకటి అలముకున్న ఈ దుష్టలోకంలో ఓ జ్యోతి ప్రకాశిస్తోంది ఉదయకాంతిలా.

144వ పాట

జీవాన్నిచ్చే సందేశం

సమయం ఉండగానే దేవుని సందేశాన్ని మనం ప్రకటించాలి.

145వ పాట

ప్రకటించడానికి సిద్ధపడదాం

మానడం తేలికే, కానీ సఫలం అయ్యేలా బలాన్ని పొందవచ్చు.

146వ పాట

మీరు నా కోసం చేశారు

తన అభిషిక్త సహోదరుల మీద ప్రేమతో చేసే ప్రతీ పనిని, వాళ్లకు నమ్మకంగా ఇచ్చే మద్దతును యేసు తన కోసమే చేసినట్టు భావిస్తాడు.

147వ పాట

దేవుని ప్రత్యేకమైన సొత్తు

తన అభిషిక్త కుమారుల్ని యేసు ఎంతో ప్రేమిస్తాడు. వాళ్లు కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడంలో సంతోషిస్తారు.

148వ పాట

నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు

యెహోవా ఇప్పటివరకు ఇచ్చినవాటిలో అత్యంత గొప్ప బహుమతి కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. అది ప్రతి ఒక్కరికీ నిరీక్షణను ఇస్తుంది.

149వ పాట

విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

దేవుని ప్రేమకు అతి గొప్ప ఉదాహరణ, విమోచన క్రయధనం. అందుకు మనం యెహోవాకు ఎల్లప్పుడు కృతజ్ఞత చూపించాలి.

150వ పాట

ముందుండి సేవచేద్దాం

యెహోవా మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడో, ఆ విధంగా ఆయనను సేవించడానికి ఆనందంగా ముందుకు రండి.

151వ పాట

దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

పరలోకంలో క్రీస్తుతో విజయాన్ని, బహుమానాన్ని పంచుకోవడానికి ఆయన సోదరులను, యెహోవా పరలోకానికి తీసుకెళ్లే రోజు కోసం మనం జాగ్రత్తగా ఎదురుచూస్తున్నాం.

152వ పాట

మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

జీవితంలో కష్టాల వల్ల మనకు భయం కలిగినప్పుడు దేవుడు మనకు బలాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని ఇస్తాడు.

153వ పాట

మీకు సంతోషంగా ఉంటుందా?

యథార్థ హృదయులను కలవడానికి మీ వంతు ప్రయత్నం చేశాక మీకు సంతోషంగా ఉండదా?

154వ పాట

సహనం చూపిస్తూ ఉందాం

కష్టాలు తట్టుకుని ఎప్పటికీ యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికి ఈ పాట మనకు సహాయం చేస్తుంది.