కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

154వ పాట

సహనం చూపిస్తూ ఉందాం

సహనం చూపిస్తూ ఉందాం

(మత్తయి 24:⁠13)

 1. ఓర్పు చూపిద్దాం,

  శ్రమలో మనం యేసులా.

  తండ్రి వాగ్దానం

  తెచ్చే ఆనందం ఊహిస్తూ,

  దేవుని న్యాయంపై,

  నమ్మకం ఉంచాడు.

  (పల్లవి)

  అంతం వచ్చేవరకు

  ఉండాలి విశ్వాసం.

  తండ్రి ప్రేమే ఇస్తుంది,

  సహనంతో తట్టుకునే శక్తి.

 2. ఈ జీవితంలో

  చూస్తామెన్నో కష్టాలను;

  కానీ త్వరలో,

  ఉంటుంది క్రొత్త జీవితం.

  కన్నీళ్లు, కష్టాలు,

  ఉండవు ఎన్నడూ.

  (పల్లవి)

  అంతం వచ్చేవరకు

  ఉండాలి విశ్వాసం.

  తండ్రి ప్రేమే ఇస్తుంది,

  సహనంతో తట్టుకునే శక్తి.

 3. యెహోవా దినం

  ఎంతో దగ్గర్లో ఉండగా

  పోగొట్టుకోము

  మనకున్న విశ్వాసాన్ని.

  సహనం చూపిస్తూ

  దేవుణ్ణి సేవిద్దాం.

  (పల్లవి)

  అంతం వచ్చేవరకు

  ఉండాలి విశ్వాసం.

  తండ్రి ప్రేమే ఇస్తుంది,

  సహనంతో తట్టుకునే శక్తి.