కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

136వ పాట

రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!

రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!

(ప్రకటన 11:15; 12:10)

 1. యెహోవా నీవెల్లప్పుడూ

  సర్వాధికారివే.

  కుమారునికి ఇచ్చావు

  రాజ్యాధికారము.

  స్థాపించావు ప్రభుత్వాన్ని,

  పాలిస్తుంది ఈ భూమిని.

  (పల్లవి)

  శక్తి, రక్షణ, రాజ్యము

  నేడు దేవుని చేతుల్లో;

  ప్రార్థిస్తాము సదా

  రావాలని నీ రాజ్యము.

 2. అపవాదికి సమయం

  లేదింక ఏమాత్రం;

  వస్తాయి కష్టాలు ఎన్నో

  తెలుసు కారణం—

  స్థాపించావు ప్రభుత్వాన్ని,

  పాలిస్తుంది ఈ భూమిని.

  (పల్లవి)

  శక్తి, రక్షణ, రాజ్యము

  నేడు దేవుని చేతుల్లో;

  ప్రార్థిస్తాము సదా

  రావాలని నీ రాజ్యము.

 3. పరలోకంలో దూతలు

  చెప్తారు స్తుతులు

  అపవాదికి అక్కడ

  లేనందుకు స్థానం

  స్థాపించావు ప్రభుత్వాన్ని

  పాలిస్తుంది ఈ భూమిని

  (పల్లవి)

  శక్తి, రక్షణ, రాజ్యము

  నేడు దేవుని చేతుల్లో;

  ప్రార్థిస్తాము సదా

  రావాలని నీ రాజ్యము.

(దాని. 2:34, 35; 2 కొరిం. 4:17, 18 కూడా చూడండి.)