కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

152వ పాట

మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

(సామెతలు 14:26)

 1. మా యెహోవా నీవు ఇచ్చిన,

  నిరీక్షణ మాలో,

  తెచ్చే ఆనందాన్ని మేము

  చెప్తాం అందరికీ.

  కానీ జీవితంలో కష్టాలు

  కలిగించి భయాలు,

  వెలిగే నిరీక్షణను

  తగ్గించివేయగా.

  (పల్లవి)

  నీవే మాకు శక్తి,

  మా నిరీక్షణ.

  మాకేం తగ్గినా నువ్విస్తావ్‌.

  ప్రకటిస్తూ ఉన్నా,

  బోధిస్తూ ఉన్నా,

  నీవే మా ధైర్యం, మా బలం.

 2. మా యెహోవా మాకు కష్టాల్లో

  ఇచ్చిన ఓదార్పు,

  మర్చిపోని హృదయాన్ని

  ఇవ్వూ నువ్వే మాకు.

  వెలిగిస్తుంది ఈ నమ్మకం

  నిరీక్షణను మాలో.

  నీ పేరు గురించి చెప్తాం

  ధైర్యంగా ఎప్పుడూ.

  (పల్లవి)

  నీవే మాకు శక్తి,

  మా నిరీక్షణ.

  మాకేం తగ్గినా నువ్విస్తావ్‌.

  ప్రకటిస్తూ ఉన్నా,

  బోధిస్తూ ఉన్నా,

  నీవే మా ధైర్యం, మా బలం.