కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

150వ పాట

ముందుండి సేవచేద్దాం

ముందుండి సేవచేద్దాం

(మత్తయి 9:37, 38)

 1. జీవితంలో ఆనందాన్ని

  పొందాలంటే ఏం చేయాలో,

  ఏ మార్గాల్లో సేవించాలో,

  యెహోవాయే నేర్పిస్తాడు.

  (పల్లవి)

  ముందుందాం, సేవిద్దాం,

  మన తండ్రినీ.

  అవసరం ఉన్న చోట్లకు

  కదిలి వెళ్దాం.

 2. ప్రపంచంలో ప్రతీచోట

  చేయాల్సింది ఎంతో ఉంది.

  ముందుకొచ్చి అందిద్దాము

  సమయాన్ని, సహాయాన్ని.

  (పల్లవి)

  ముందుందాం, సేవిద్దాం,

  మన తండ్రినీ.

  అవసరం ఉన్న చోట్లకు

  కదిలి వెళ్దాం.

 3. ఇంటివద్ద, వేరే చోట

  నిర్మాణాల్ని కట్టేస్తుంటాం.

  కొత్త భాష నేర్చుకుని

  రాజ్యవార్త ప్రకటిస్తాం.

  (పల్లవి)

  ముందుందాం, సేవిద్దాం,

  మన తండ్రినీ.

  అవసరం ఉన్న చోట్లకు

  కదిలి వెళ్దాం.

(యోహా. 4:35; అపొ. 2:8; రోమా. 10:14 కూడా చూడండి.)