కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

140వ పాట

పయినీరు జీవితం

పయినీరు జీవితం

(ప్రసంగి 11:6)

 1. సూర్యుని లేలేత కిరణాల కన్నా

  ముందుగానే మేము

  నిద్ర లేచి వెళ్తాం ప్రార్థించి.

  నవ్వుతూ అందర్నీ పలకరిస్తాము,

  ప్రజలు వచ్చినా రాకున్నా

  ఆపము మా సేవ.

  (పల్లవి)

  ఇదే మా జీవితం;

  ఇది మా నిర్ణయం;

  యెహోవా కోసం మేం జీవిస్తాం.

  ఓర్పుతో ఈ పని

  చేస్తాం మేం ఎప్పుడూ

  యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తాం.

 2. సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా,

  శ్రమించి, సంతోష

  హృదయంతో వచ్చి ప్రార్థిస్తాం.

  మా పూర్ణ శక్తితో సేవించేలా రోజు,

  ఈ గొప్ప వరాన్ని ఇచ్చిన

  తండ్రిని స్తుతిస్తాం.

  (పల్లవి)

  ఇదే మా జీవితం;

  ఇది మా నిర్ణయం;

  యెహోవా కోసం మేం జీవిస్తాం.

  ఓర్పుతో ఈ పని

  చేస్తాం మేం ఎప్పుడూ

  యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తాం.