కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

144వ పాట

జీవాన్నిచ్చే సందేశం

జీవాన్నిచ్చే సందేశం

(యెహెజ్కేలు 3:17-19)

 1. రానుంది త్వరలో

  యెహోవా మహాదినం.

  ఈలోగా చెప్పాలి

  ఈ వార్త అందరికీ.

  (పల్లవి)

  విని వాళ్లు లోబడితే

  పొందవచ్చు జీవాన్ని.

  వాళ్లే కాదు మనం కూడా

  జీవిస్తాము ఈ వార్తను

  చాటిస్తే.

 2. ‘యెహోవా తండ్రితో

  సమాధానపడండి’

  అంటూ ఆహ్వానిద్దాం

  ప్రజలందర్నీ మనం.

  (పల్లవి)

  విని వాళ్లు లోబడితే

  పొందవచ్చు జీవాన్ని.

  వాళ్లే కాదు మనం కూడా

  జీవిస్తాము ఈ వార్తను

  చాటిస్తే.

 3. జీవాన్ని ఇచ్చే సత్యం

  వినాలింకా ఎంతోమంది.

  ఆలస్యం చేయకుండా,

  నేర్పిద్దాము ఉచితంగా.

  (పల్లవి)

  విని వాళ్లు లోబడితే

  పొందవచ్చు జీవాన్ని.

  వాళ్లే కాదు మనం కూడా

  జీవిస్తాము ఈ వార్తను

  చాటిస్తే.