కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

142వ పాట

అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

(1 తిమోతి 2:4)

 1. రక్షించాలని ప్రతి ఒకర్ని

  కోరుకుంటున్న మన దేవుణ్ణి

  అనుకరిద్దాం మనమందరం

  చూపించకుండా పక్షపాతాన్ని.

  (పల్లవి)

  దేశం, జాతి చూడము;

  చెప్తాం మంచి వార్తను.

  ప్రాముఖ్యమైంది హృదయమెంతో.

  చూపిస్తుందాం శ్రద్ధను;

  ఆహ్వానిద్దాం వాళ్లను,

  దేవుని స్నేహితులవ్వమని.

 2. పట్టించుకోము ప్రాంతం ఏదని;

  చూసేందుకు ఎలా ఉన్నారని;

  అమూల్యమైంది వాళ్ల హృదయం,

  చూస్తాడదే యెహోవా దేవుడూ.

  (పల్లవి)

  దేశం, జాతి చూడము;

  చెప్తాం మంచి వార్తను.

  ప్రాముఖ్యమైంది హృదయమెంతో.

  చూపిస్తుందాం శ్రద్ధను;

  ఆహ్వానిద్దాం వాళ్లను,

  దేవుని స్నేహితులవ్వమని.

 3. లోకాన్ని వీడి వచ్చేవాళ్లను

  ఆహ్వానిస్తాడు మన దేవుడు.

  ప్రకటిద్దాం ఈ మంచి వార్తను

  అందరికీ ఏ భేదం లేకుండా.

  (పల్లవి)

  దేశం, జాతి చూడము;

  చెప్తాం మంచి వార్తను.

  ప్రాముఖ్యమైంది హృదయమెంతో.

  చూపిస్తుందాం శ్రద్ధను;

  ఆహ్వానిద్దాం వాళ్లను,

  దేవుని స్నేహితులవ్వమని.