కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

138వ పాట

యెహోవా నీ పేరు

యెహోవా నీ పేరు

(కీర్తన 83:18)

 1. ధరించావు నీవే

  యెహోవా అనే పేరు

  జీవముగల దేవా,

  సృష్టికర్త నీవే.

  నీ జనాంగముగా

  చేసుకున్నావ్‌ మమ్మల్ని.

  నీ మహిమను గూర్చి

  చాటిస్తామంతటా.

  (పల్లవి)

  యెహోవా, యెహోవా,

  నీలాంటి దేవుడు

  లేనేలేడు భూమిపైన,

  పరలోకంలోను.

  సర్వలోకంలో నీవేగా

  మహోన్నతుడవు;

  యెహోవా, యెహోవా,

  తెలుసుకోవాలందరూ.

 2. నీ ఇష్టప్రకారం

  ఏదైనా చేసే శక్తి

  ఇస్తావు నీవే మాకు—

  యెహోవా నీ పేరు.

  నీ సాక్షులమని

  పిలుస్తున్నావ్‌ మమ్మల్ని.

  నీ ప్రజలని అంటూ

  ఘనపరిచావు.

  (పల్లవి)

  యెహోవా, యెహోవా,

  నీలాంటి దేవుడు

  లేనేలేడు భూమిపైన,

  పరలోకంలోను.

  సర్వలోకంలో నీవేగా

  మహోన్నతుడవు;

  యెహోవా, యెహోవా,

  తెలుసుకోవాలందరూ.