కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

148వ పాట

నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు

నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు

(యోహాను 15:⁠13)

 1. యెహోవా, మా దేవా, నిరీక్షణనిచ్చి,

  నింపావు వెలుగు మా అందరిలో!

  అర్పిస్తాం జీవితం, సువార్త చాటుతాం;

  మా పూర్ణ శక్తితో నీ చిత్తాన్ని చేస్తాం.

  (పల్లవి)

  ప్రియ కుమారుణ్ణి ఇచ్చావు మా కోసం.

  ఈ గీతాన్ని మేమంతా ఆలపిస్తాం నిరంతరం..

 2. నీ ప్రేమ, నీ దయ ఎంతెంతో గొప్పవి.

  నీ నామం, నీ స్నేహం మాకెంతో ప్రియం.

  అత్యంత ప్రశస్తం, మరెంతో అమూల్యం

  మా కోసం ఇచ్చిన విమోచన మూల్యం.

  (పల్లవి)

  ప్రియ కుమారుణ్ణి ఇచ్చావు మా కోసం.

  ఈ గీతాన్ని మేమంతా ఆలపిస్తాం నిరంతరం.

  (ముగింపు)

  యెహోవా, మా దేవా, కృతజ్ఞులం మేము;

  పంపావు మా కోసం ఏకైక కుమారుణ్ణి.

(యోహా 3:16; 1 యోహా. 4:9 కూడా చూడండి.)