కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

151వ పాట

దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

(రోమీయులు 8:⁠19)

 1. క్రీస్తుతో పరిపాలించే

  విశ్వసనీయుల్ని,

  దేవుడు వెల్లడి చేసే

  సమయం రానుంది.

  (పల్లవి)

  దేవుని కుమారులుగా

  మహిమను పొంది,

  పంచుకుంటారు విజయం

  ప్రభువు క్రీస్తుతో.

 2. రాజులకు రాజు యేసు

  తుది పిలుపుతో

  తీసుకెళ్తాడు త్వరలో

  అభిషిక్తులను.

  (పల్లవి)

  దేవుని కుమారులుగా

  మహిమను పొంది,

  పంచుకుంటారు విజయం

  ప్రభువు క్రీస్తుతో.

  (బ్రిడ్జ్‌)

  చివరిగా యుద్ధం గెల్చి

  దేవుని పిల్లలు,

  గొర్రెపిల్లకు భార్యగా

  ఉంటారు ఎప్పుడూ.

  (పల్లవి)

  దేవుని కుమారులుగా

  మహిమను పొంది,

  పంచుకుంటారు విజయం

  ప్రభువు క్రీస్తుతో.