కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

149వ పాట

విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

(లూకా 22:20)

 1. యెహోవా, మా దేవా, చూపించావు నీవు

  సాటిలేని నీ గొప్ప ప్రేమను మా మీద.

  ప్రియమైన కుమారుణ్ణి బలి ఇచ్చి

  మా కోసము చేశావెంతో గొప్ప త్యాగాన్ని.

  (పల్లవి)

  అర్పించాడు మాకై ప్రాణం.

  చిందించాడు తన రక్తం.

  రుణపడి ఉంటాం దేవా నీకు నిరంతరం.

 2. ఎంతో సంతోషంగా అర్పించాడు యేసు

  పరిపూర్ణ జీవాన్ని మా మీద ప్రేమతో.

  లేనేలేదు నిరీక్షణ ఎవ్వరికీ

  ఆయనొచ్చి చూపే దాకా జీవ మార్గాన్ని.

  (పల్లవి)

  అర్పించాడు మాకై ప్రాణం.

  చిందించాడు తన రక్తం.

  రుణపడి ఉంటాం దేవా నీకు నిరంతరం.