కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దీనుల మొరను యెహోవా వింటాడు

దీనుల మొరను యెహోవా వింటాడు

దీనుల మొరను యెహోవా వింటాడు

ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానియైన సొలొమోను రాజు గమనించినట్లు, ‘సమయం, అనుకోని సంఘటనలు’ మనందరికీ ఎదురౌతాయి. (ప్రసం. 9:11, NW) దుఃఖకరమైన సంఘటనలు లేదా తీవ్రమైన పరీక్షలు మన జీవితాన్నే మార్చేస్తాయి. ఉదాహరణకు, సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఒక వ్యక్తి భావోద్వేగపరంగా ఎంతగానో కృంగిపోతాడు. ఆ తర్వాత కొన్ని వారాలపాటు, నెలలపాటు ఆ వ్యక్తి దుఃఖానికి, నిరాశకు లోనౌతాడు. ఆయన ఎంత సందిగ్ధంలో ఉంటాడంటే, ప్రార్థనలో యెహోవాను సమీపించడానికి తాను అర్హుణ్ణి కానని అనుకుంటాడు.

అలాంటి పరిస్థితిలో ఉన్నవారికి ప్రోత్సాహం, శ్రద్ధ, ప్రేమ అవసరం. “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు” అని కీర్తనకర్తయైన దావీదు అభయమిచ్చాడు. (కీర్త. 145:14) బైబిలు మనకిలా చెబుతోంది: “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దిన. 16:9) ఆయన “వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నా[డు].” (యెష. 57:15) నలిగినవారికి, దీనులకు యెహోవా సహాయాన్ని, ఆదరణను ఎలా ఇస్తాడు?

“సమయోచితమైన మాట”

యెహోవా ఎన్నో విధాలుగా సమయానుకూలమైన సహాయాన్నిస్తున్నాడు. వాటిలో, క్రైస్తవ సహోదరత్వం ఒకటి. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అని క్రైస్తవులకు ఉపదేశించబడింది. (1 థెస్స. 5:14) ఒక వ్యక్తి శ్రమను, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దయగల తోటి విశ్వాసులు చూపించే శ్రద్ధ, ప్రేమ ఆయనను బలపరుస్తాయి. మనం కృంగిపోయిన వ్యక్తితో కొద్దిసేపే మాట్లాడినా, మన మాటలు ఓదార్పుకరంగా ఉంటే వాటి ద్వారా ఆ వ్యక్తి ఎంతగానో ప్రోత్సహించబడతాడు. అలాంటి ఆలోచనాపూర్వకమైన మాటలు బహుశా అదే విధమైన మానసిక, భావోద్వేగపరమైన బాధను అనుభవించిన వ్యక్తి నుండి రావచ్చు లేదా అనుభవంగల స్నేహితుడు తాను గమనించిన దానిని బట్టి మీతో అలా మాట్లాడవచ్చు. ఈ విధంగా మన సహోదర సహోదరీలను ఉపయోగించి దీనుల ప్రాణాల్ని యెహోవా ఉజ్జీవింపజేయగలడు.

కొత్తగా పెళ్లైన క్రైస్తవ పెద్ద ఆలిక్స్‌ విషయమే తీసుకోండి. నయంకాని ఓ వ్యాధితో ఆయన భార్య అకస్మాత్తుగా చనిపోయింది. సహానుభూతిగల ఓ ప్రయాణ పైవిచారణకర్త ఆలిక్స్‌తో ఓదార్చే మాటలను పంచుకోవాలనుకున్నాడు. ఈయన కూడా తన భార్యను మరణంలో కోల్పోయాడు, కానీ ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తాను భార్యను కోల్పోయినప్పుడు సున్నితమైన, బలహీనమైన భావోద్వేగాలు తనను ఎలా కృంగదీశాయో ఈయన చెప్పాడు. పరిచర్యలో, సంఘకూటాల్లో ఇతరులతోపాటు ఉన్నప్పుడు ఈయనకు మంచిగా అనిపించేది. కానీ తన ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో ఒంటరిగా ఉన్నట్లు భావించేవాడు. ఈయన అనుభవం విన్న ఆలిక్స్‌ ఇలా చెప్పాడు: “నాలో కలిగే భావాలు సర్వసాధారణమేననీ ఇతరులకు కూడా అలాంటి భావాలే కలిగాయనీ తెలుసుకోవడం నాకెంతో ఓదార్పునిచ్చింది.” నిజమే, బాధల్లో ఉన్నప్పుడు “సమయోచితమైన మాట” ఎంతో ఓదార్పును ఇవ్వగలదు.—సామె. 15:23.

తమ వివాహజతను మరణంలో కోల్పోయిన అనేకమంది గురించి తెలిసిన మరో క్రైస్తవ పెద్ద కొన్ని ప్రోత్సాహకరమైన మాటల్ని ఆలిక్స్‌తో పంచుకోవాలనుకున్నాడు. మనమెలా భావిస్తామో, మనకేమి అవసరమో యెహోవాకు తెలుసని ఆయన సానుభూతితో, ప్రేమతో గుర్తుచేశాడు. “రానున్న నెలల్లో, సంవత్సరాల్లో ఓ తోడు అవసరమనిపిస్తే, మళ్లీ పెళ్లి చేసుకునే ప్రేమపూర్వకమైన ఏర్పాటును యెహోవా చేశాడని గుర్తుంచుకోండి” అని ఆ సహోదరుడు అన్నాడు. వాస్తవానికి, తమ వివాహజతను మరణంలో కోల్పోయి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారందరూ అలా చేసుకునే స్థితిలో ఉండరు. అయితే, ఆ సహోదరుని మాటలను గుర్తుచేసుకుంటూ ఆలిక్స్‌ ఇలా అన్నాడు: “ఇది యెహోవా చేసిన ఏర్పాటు అని గుర్తుంచుకోవడం వల్ల, భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటే, తమ వివాహజతకు లేదా యెహోవా చేసిన వివాహ ఏర్పాటుకు ద్రోహం చేసినట్లు అవుతుందేమోననే ప్రతికూల భావాలు కలగకుండా ఉంటాయి.”—1 కొరిం. 7:8, 9, 39.

“యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి” అని ఎన్నో పరీక్షలను, కష్టాలను అనుభవించిన కీర్తనకర్తయైన దావీదు గుర్తించాడు. (కీర్త. 34:15) దీనుల మొరకు యెహోవా తప్పకుండా సరైన సమయంలో జవాబిస్తాడు. దయగల, పరిణతి చెందిన తోటి క్రైస్తవులు బాగా ఆలోచించి, వివేచనతో మాట్లాడే మాటల ద్వారా ఆయన అలా జవాబిస్తాడు. క్రైస్తవ సహోదరత్వపు ఏర్పాటు అమూల్యమైనదే కాక ప్రయోజనకరమైనది కూడా.

క్రైస్తవ కూటాల ద్వారా సహాయం

కృంగిపోయిన వ్యక్తిలో ప్రతికూల భావాలు త్వరగా కలుగుతాయి. వాటివల్ల ఆయన ఇతరుల నుండి వేరుగా ఉండేందుకు మొగ్గుచూపవచ్చు. అయితే, సామెతలు 18:1 ఇలా హెచ్చరిస్తోంది: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” ఆలిక్స్‌ ఇలా ఒప్పుకుంటున్నాడు: “వివాహజతను కోల్పోయినప్పుడు, ఉన్నట్టుండి మనసు ప్రతికూల ఆలోచనలతో నిండిపోతుంది.” తనను తాను ఇలా ప్రశ్నించుకున్నట్లు ఆయన గుర్తుచేసుకుంటున్నాడు: “‘నేను మరోలా చేసివుండాల్సిందా? నేను మరింత శ్రద్ధగలవాడిగా, అర్థంచేసుకునే వాడిగా ఉండాల్సిందా?’ నేను ఒంటరిగా ఉండాలనుకోలేదు. అయితే, మీరు ఒంటరిగా ఉన్నారనే విషయం ప్రతీరోజు గుర్తుకొస్తుంది కాబట్టి ఇలా ఆలోచించకుండా ఉండడం చాలా కష్టం.”

కృంగిపోయినవారికి, ముందెన్నటికన్నా ఇప్పుడు మంచి సహవాసం మరింత అవసరం. అలాంటి సహవాసం సంఘకూటాల్లో దొరుకుతుంది. అక్కడ మనం సానుకూలమైన, ప్రోత్సాహకరమైన దైవిక ఆలోచనలపై మనసు నిలుపుతాం.

మన పరిస్థితి గురించి సరిగ్గా ఆలోచించేందుకు క్రైస్తవ కూటాలు తోడ్పడతాయి. మనం బైబిలు భాగాలను వింటూ, వాటి గురించి ధ్యానిస్తూ ఉన్నట్లైతే, మనకు ఎదురైన కష్టం గురించే ఆలోచిస్తూ కూర్చోము. బదులుగా, యెహోవా సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడడం, ఆయన నామం పరిశుద్ధపరచబడడం అనే అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశాల గురించి కూడా ఆలోచిస్తాం. అంతేకాక, మనం పడే బాధ గురించి ఇతరులకు తెలియకపోయినా లేదా మన బాధను వారు అర్థం చేసుకోకపోయినా, యెహోవా మాత్రం అర్థం చేసుకుంటాడని కూటాల్లో నేర్చుకున్నప్పుడు మనం బలాన్ని పొందుతాం. “మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును” అని యెహోవాకు తెలుసు. (సామె. 15:13) సత్య దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడని తెలుసుకోవడం వల్ల జీవితంలో ముందుకెళ్లడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, బలాన్ని మనం పొందుతాం.—కీర్త. 27:14.

తన శత్రువుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పుడు దావీదు రాజు దేవునికి ప్రార్థిస్తూ తన బాధను ఇలా వ్యక్తం చేశాడు: “నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను.” (కీర్త. 143:4) క్లిష్ట పరిస్థితుల వల్ల ఓ వ్యక్తి శారీరకంగా, భావోద్వేగపరంగా కృంగిపోవడమేకాక అతని హృదయం స్తంభించిపోతుంది. కష్టాలనేవి, అనారోగ్యం లేదా దీర్ఘకాల అస్వస్థతల రూపంలో రావచ్చు. అయితే వాటిని సహించడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (కీర్త. 41:1-3) నేడు యెహోవా ఎవరినీ అద్భుతరీతిలో బాగుచేయడు కానీ, పరిస్థితిని సహించడానికి అవసరమైన జ్ఞానాన్ని, బలాన్ని ఇస్తాడు. కష్టాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు దావీదు సహాయం కోసం యెహోవావైపు తిరిగాడని గుర్తుంచుకోండి. ఆయనిలా పాడాడు: “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.”—కీర్త. 143:5.

ఈ ప్రేరేపిత భావాలు యెహోవా వాక్యంలో రాయబడ్డాయి కాబట్టి, ఆయన మనలను అర్థం చేసుకుంటాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ మాటలు, ఆయన మన విన్నపాలను వింటాడనేందుకు రుజువునిస్తున్నాయి. మనం యెహోవా సహాయాన్ని అంగీకరిస్తే, ‘ఆయనే మనలను ఆదుకుంటాడు.’—కీర్త. 55:22.

‘ఎడతెగక ప్రార్థించండి’

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు 4:8 చెప్తోంది. మనం ప్రార్థించడం ద్వారా యెహోవాకు దగ్గరౌతాం. “యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు. (1 థెస్స. 5:17) మన భావాలను మాటల్లో చెప్పలేకపోయినా, “ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము” చేస్తుంది. (రోమా. 8:26, 27) యెహోవా మన భావాలను తప్పక అర్థం చేసుకుంటాడు.

యెహోవాతో అలాంటి దగ్గరి సంబంధం కలిగివున్న మానిక ఇలా అంటోంది: “ప్రార్థించడం, బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం చేయడం వల్ల యెహోవా నాకు చాలా దగ్గరి స్నేహితుడైనట్లు అనిపించింది. ఆయనపై ఎంతగా నమ్మకం కుదిరిందంటే, ఆయన నాపై ఎల్లప్పుడూ శ్రద్ధ చూపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నేనెలా భావిస్తున్నానో చెప్పలేకపోయినా, ఆయన నన్ను అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం నాకు ఓదార్పునిస్తుంది. ఆయన చూపించే దయకు, ఆయనిచ్చే ఆశీర్వాదాలకు అంతులేదని నాకు తెలుసు.”

కాబట్టి, తోటి క్రైస్తవులు ప్రేమతో చెప్పే ఓదార్పుకరమైన మాటలను అంగీకరిద్దాం. క్రైస్తవ కూటాల్లో ఇవ్వబడే దయగల ఉపదేశాన్ని, విశ్వాసాన్ని బలపరిచే జ్ఞాపికలను పాటిద్దాం. అలాగే, ప్రార్థనలో మన హృదయాన్ని యెహోవా ఎదుట కుమ్మరిద్దాం. ఈ సమయానుకూలమైన ఏర్పాట్ల ద్వారా యెహోవా మనపట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. తన సొంత అనుభవంతో ఆలిక్స్‌ ఇలా అన్నాడు: “మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడానికి మనం చేయగలిగేది చేస్తే, మనకెదురయ్యే ఎలాంటి శ్రమనైనా సహించేందుకు అవసరమైన ‘బలాధిక్యాన్ని’ పొందుతాం.”—2 కొరిం. 4:7.

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

దీనులకు ఓదార్పు

మానవ భావోద్వేగాలకు సంబంధించిన ఎన్నో వ్యక్తీకరణలు కీర్తనల్లో ఉన్నాయి. అంతేకాక, భావోద్వేగపరమైన ఒత్తిళ్ల వల్ల సతమతమౌతున్న దీనుల మొరను యెహోవా తప్పకుండా వింటాడనే హామీలు కూడా ఉన్నాయి. కీర్తనల్లో ఉన్న కొన్ని చరణాలను గమనించండి.

“నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.”—కీర్త. 18:6.

“విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”—కీర్త. 34:18.

“గుండె చెదరినవారిని ఆయన [యెహోవా] బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.”—కీర్త. 147:3.

[17వ పేజీలోని చిత్రం]

బాధల్లో ఉన్నప్పుడు “సమయోచితమైన మాట” ఎంత ఓదార్పునిస్తుంది!