రెండో కొరింథీయులు 4:1-18

  • మంచివార్త వెలుగు (1-6)

    • అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం (4)

  • మట్టి పాత్రల్లో సంపద (7-18)

4  దేవుడు మమ్మల్ని కరుణించి మాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి మేము అధైర్యపడం.*  అయితే సిగ్గుపడాల్సి వచ్చే మోసకరమైనవాటిని మేము వదిలేశాం, మేము కుయుక్తితో నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని కలుషితం చేయట్లేదు;+ అయితే ప్రజలకు సత్యాన్ని ప్రకటిస్తూ,* దేవుని ముందు ప్రతీ వ్యక్తి మనస్సాక్షికి మమ్మల్ని మేము సిఫారసు చేసుకుంటున్నాం.+  మేము ప్రకటించే మంచివార్త ముసుగు వేయబడి ఉందంటే, అది నాశనం కాబోయేవాళ్లకే.  దేవుని ప్రతిబింబమైన క్రీస్తు+ గురించిన మహిమగల మంచివార్త వెలుగు వాళ్లమీద ప్రకాశించకుండా+ ఉండేలా, ఈ లోక* దేవుడు+ ఆ అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలగజేశాడు.+  మేము మా గురించి కాదుగానీ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ దాసులమని ప్రకటిస్తున్నాం.  ఎందుకంటే, “చీకట్లో నుండి వెలుగు ప్రకాశించాలి” అని చెప్పిన దేవుడే+ మన హృదయాల మీద ప్రకాశించి, క్రీస్తు ముఖం ద్వారా దేవుని మహిమాన్విత జ్ఞానంతో మన హృదయాలు ప్రకాశించేలా చేశాడు.+  అయితే, మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదనే+ విషయం స్పష్టమవ్వడానికి మట్టి పాత్రల్లో+ ఈ సంపద మాకు ఉంది.+  మమ్మల్ని అన్నివైపులా కష్టాలు చుట్టుముడుతున్నాయి, కానీ పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయంలో ఉన్నాం, కానీ దిక్కుతోచని స్థితిలో లేము;*+  హింసించబడుతున్నాం, కానీ విడిచిపెట్టబడలేదు;+ పడగొట్టబడుతున్నాం, కానీ నశించిపోవట్లేదు.+ 10  మేము ఎక్కడికి వెళ్లినా యేసులాగే మాకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురౌతోంది.+ మేము యేసులాంటి జీవితాన్ని గడుపుతున్నామని ప్రజలు తెలుసుకోవాలని* అలా జరుగుతోంది. 11  బ్రతికున్న మాకు యేసు కోసం ఎప్పుడూ మరణం ఎదురౌతోంది.+ యేసులా మేము కష్టాలు పడుతున్నామని ప్రజలు తెలుసుకోవడానికి* అలా జరుగుతోంది. 12  మేము మరణాన్ని ఎదుర్కొంటున్నా, అది మీరు జీవం పొందడానికే. 13  “నాకు విశ్వాసం ఉంది, కాబట్టే నేను మాట్లాడాను”+ అని లేఖనాల్లో రాసివున్న లాంటి విశ్వాసంగల మనోవైఖరే మాకు ఉంది; మాకు కూడా విశ్వాసం ఉంది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. 14  ఎందుకంటే, యేసును బ్రతికించిన దేవుడు మమ్మల్ని కూడా యేసులాగే బ్రతికించి మీతోపాటు ఆయన ముందుకు తీసుకొస్తాడని+ మాకు తెలుసు. 15  ఎందుకంటే ఇవన్నీ మీ కోసమే; దేవునికి మహిమ కలిగేలా ఎక్కువమంది ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల విస్తరిస్తున్న అపారదయ ఇంకా సమృద్ధిగా విస్తరించేలా, ఇవన్నీ మీ కోసమే.+ 16  అందుకే మనం అధైర్యపడం.* మన శరీరాలు కృశించిపోతున్నా మన హృదయాలు, మన మనసులు రోజురోజుకీ నూతనమౌతున్నాయి. 17  ఎందుకంటే, మనకు వచ్చే శ్రమలు* కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి. కానీ వాటివల్ల మనం పొందే బహుమతి ఎంతో గొప్పది,* శాశ్వతమైనది.+ 18  అందుకే మనం, కనిపించేవాటి మీద కాకుండా కనిపించనివాటి మీద దృష్టిపెడతాం.+ ఎందుకంటే కనిపించేవి తాత్కాలికం, కనిపించనివి శాశ్వతం.

అధస్సూచీలు

లేదా “పట్టువిడవం.”
లేదా “వెల్లడిచేస్తూ.”
అక్ష., “వ్యవస్థ.” లేదా “యుగ.” పదకోశం చూడండి.
లేదా “నిరాశానిస్పృహల్లో విడిచిపెట్టబడలేదు” అయ్యుంటుంది.
లేదా “యేసు జీవితం మా శరీరాల్లో వెల్లడిచేయబడాలని.”
లేదా “నాశనమయ్యే మా శరీరాల్లో యేసు జీవితం వెల్లడిచేయబడడానికి.”
లేదా “పట్టువిడవం.”
లేదా “పరీక్షలు.”
లేదా “బరువైనది.”