కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’

‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’

‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’

ఇతరులు దయతో మీకు ఏమైనా చేసినప్పుడు, మీరెలా కృతజ్ఞత చూపిస్తారు? మిద్యానీయులతో యుద్ధం చేసిన తర్వాత, ఇశ్రాయేలు సైన్యాధిపతులు తమ కృతజ్ఞతను ఎలా చూపించారో గమనించండి. ఇశ్రాయేలీయులు బయల్పెయోరుకు సంబంధించి పాపం చేసిన తర్వాత ఆ యుద్ధం జరిగింది. దేవుడు తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించాడు. దోపుడు సొమ్మును 12,000 మంది సైనికులు, మిగతా ఇశ్రాయేలీయులు కలిసి పంచుకున్నారు. యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని బట్టి, సైనికులు తమ వాటాలో నుండి కొంత భాగాన్ని యాజకులకు ఇచ్చారు. అలాగే, మిగతా ఇశ్రాయేలీయులు కూడా తమ వాటాలో నుండి కొంత భాగాన్ని లేవీయులకు ఇచ్చారు.—సంఖ్యా. 31:1-5, 25-30.

అయితే, సైన్యాధిపతులు ఇంకా ఎక్కువే చేయాలనుకున్నారు. వారు మోషేతో ఇలా అన్నారు: “నీ సేవకులమైన మేము మా చేతిక్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.” వారు బంగారాన్ని, ఇతర నగలను యెహోవాకు అర్పణగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు తెచ్చిన బంగారు నగల మొత్తం బరువు 190 కిలోల కన్నా ఎక్కువే.—సంఖ్యా. 31:49-54.

నేడు కూడా, యెహోవా తమకు చేసిన దానిపట్ల చాలామంది తమ కృతజ్ఞతను చూపిస్తున్నారు. అలా కృతజ్ఞతను చూపించేవారిలో యెహోవాకు సమర్పించుకొనని వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక ఉదాహరణను పరిశీలించండి. 2009లో ఇటలీలోని బొలోగ్నలో ఓ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఒక బస్సు డ్రైవరు ఆ సమావేశానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులను సమావేశం జరిగే స్టేడియంకు తీసుకెళ్లి, తీసుకువచ్చాడు. ఆ డ్రైవరు చాలా నెమ్మదస్థుడు, బస్సును జాగ్రత్తగా నడిపాడు కాబట్టి, ఆ బస్సులో ప్రయాణించిన ప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఓ కార్డు ఇవ్వాలనుకున్నారు. ఆ కార్డుతోపాటు టిప్పును, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వాలనుకున్నారు. వాటిని తనకు ఇచ్చినప్పుడు ఆ డ్రైవరు ఇలా అన్నాడు: “మీరిచ్చే కార్డును, పుస్తకాన్ని సంతోషంగా తీసుకుంటాను కానీ డబ్బును మాత్రం మీకే తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే, మీరు చేస్తున్న పనిని కొనసాగించేందుకు దాన్ని నేను విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఓ యెహోవాసాక్షిని కాకపోయినా, మీరు ఏది చేసినా ప్రేమతోనే చేస్తారని గమనించాను కాబట్టే నేను ఈ విరాళం ఇవ్వాలనుకుంటున్నాను.”

యెహోవా మీకు చేసిన దానిపట్ల మీ కృతజ్ఞతను ఎన్నో రకాలుగా చూపించవచ్చు. యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు ఇవ్వడం వాటిలో ఒకటి. (మత్త. 24:14) కొందరు ఏ పద్ధతుల్లో విరాళాలు ఇస్తారో ఈ కింది బాక్సులో ఇవ్వబడింది.

[20, 21వ పేజీలోని బాక్సు]

కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు . . .

ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు

చాలామంది కొంత మొత్తాన్ని పక్కనపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు.

ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. డబ్బు రూపంలో పంపించే విరాళాలను నేరుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు (క్రింద ప్రత్యేకంగా పేర్కొనబడిన వాటికి సంబంధించిన స్వచ్ఛంద విరాళాలను కూడా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు.) అలా పంపించే చెక్కులను “Watch Tower *” పేరున రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను కూడ విరాళంగా పంపించవచ్చు. అలాంటి వస్తువులను పంపిస్తున్నప్పుడు మీరే వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

షరతుపై విరాళ ట్రస్టు ఏర్పాటు *

మీ విరాళాలను ప్రపంచవ్యాప్త పని కోసం ఉపయోగించడానికి వాచ్‌టవర్‌ట్రస్టులో జమచేయవచ్చు. అయితే మీరు కావాలనుకున్నప్పుడు డబ్బు తిరిగి తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

దానధర్మ ప్రణాళిక *

డబ్బు రూపంలోనేకాక ఇతర పద్ధతుల్లో కూడా ప్రపంచవ్యాప్త రాజ్య సేవ కోసం విరాళాలు ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు ఏమిటంటే:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ ఖాతాలకు లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు విరాళంగా ఇవ్వవచ్చు లేదా చట్టబద్ధంగా రాయబడిన వీలునామాలో లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి వారి తదనంతరం అవి విరాళంగా ఇవ్వబడే ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన ఆధారపత్రాలు రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న ఒక నిర్దిష్ట కార్పోరేషన్‌కు బదిలీ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో Watch Towerను * లబ్ధిదారుగా సూచించవచ్చు. మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.

“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలంటే దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక * అనే బ్రోషురు ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. ఆ బ్రోషురును చదివి, తమ న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా మనం మతపరంగానూ, మానవతా దృష్టితోనూ చేస్తున్న పనికి మద్దతునివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందారు.

మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన నంబరుకు ఫోన్‌చేసి లేక కింద ఇవ్వబడిన చిరునామాకు ఉత్తరం రాసి యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు. లేదా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Jehovah’s Witnesses of India,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[అధస్సూచీలు]

^ పేరా 10 ఇండియాలోనైతే చెక్కులను “The Watch Tower Bible and Tract Society of India” పేరున రాయాలి.

^ పేరా 11 ఇది ఇండియాకు వర్తించదు

^ పేరా 13 గమనిక: పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పన్ను నిబంధనలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి మీ అకౌంటెంట్‌ను లేక వకీలును సంప్రదించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని కూడా సంప్రదించండి.

^ పేరా 20 ఇండియాలోనైతే, “The Watch Tower Bible and Tract Society of India” పేరున రాయాలి

^ పేరా 21 ఇండియాలో లభించదు