సామెతలు 18:1-24
18 తనను తాను వేరు చేసుకునేవాడు తన స్వార్థ కోరికల్ని అనుసరిస్తున్నాడు;అతను తెలివి* అంతటినీ తిరస్కరిస్తున్నాడు.*
2 మూర్ఖుడికి అవగాహన అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు;తన హృదయంలో ఉన్నది బయటికి చెప్పడమే అతనికి ఇష్టం.+
3 దుష్టుడు వచ్చినప్పుడు తిరస్కారం కూడా వస్తుంది,అవమానంతో పాటు తలవంపులు కూడా వస్తాయి.+
4 మనిషి నోటి మాటలు లోతైన నీళ్ల లాంటివి.+
తెలివి అనే ఊట ఉబుకుతూ వాగులా ప్రవహిస్తుంది.
5 దుష్టుడి పట్ల పక్షపాతం చూపించడం,నీతిమంతుడికి న్యాయం చేయకపోవడం+ మంచిదికాదు.+
6 మూర్ఖుడి మాటలు గొడవలకు దారితీస్తాయి,+అతని నోరు దెబ్బల్ని ఆహ్వానిస్తుంది.+
7 మూర్ఖుడి నోరు అతన్ని నాశనం చేస్తుంది,+అతని పెదాలు అతని ప్రాణానికి ఉరి లాంటివి.
8 లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దల* లాంటివి;+అవి నేరుగా కడుపు లోపలికి వెళ్లిపోతాయి.
9 బద్దకంగా పనిచేసేవాడునాశనం చేసేవాడికి సహోదరుడు.+
10 యెహోవా పేరు బలమైన బురుజు.+
నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు.*+
11 ధనవంతుడి ఆస్తి అతనికి ప్రాకారాలుగల నగరం లాంటిది;అతని ఊహలో అది సురక్షితమైన ప్రాకారం లాంటిది.+
12 నాశనానికి ముందు మనిషి హృదయం గర్విస్తుంది,+ఘనతకు ముందు వినయం ఉంటుంది.+
13 వాస్తవాలు వినకముందే ఒక విషయం గురించి మాట్లాడడం తెలివితక్కువతనం,దానివల్ల అవమానాలపాలు అవుతారు.+
14 మనోబలంతో మనిషి తన అనారోగ్యాన్ని సహించగలుగుతాడు,+నలిగిన మనస్సును* భరించడం ఎవరికి సాధ్యం?+
15 అవగాహన గలవాడి హృదయం జ్ఞానాన్ని సంపాదిస్తుంది,+తెలివిగలవాడి చెవి జ్ఞానం కోసం వెతుకుతుంది.
16 మనిషి ఇచ్చే బహుమతి అతనికి మార్గం తెరుస్తుంది;+అది గొప్పవాళ్లను కలుసుకునే అవకాశాన్ని అతనికి ఇస్తుంది.
17 వ్యాజ్యంలో మొదట మాట్లాడే వ్యక్తి చెప్పేది సరైనదిగా కనిపిస్తుంది,+అయితే రెండో వ్యక్తి వచ్చి అతన్ని ప్రశ్నించినప్పుడు* నిజాలు బయటికొస్తాయి.+
18 చీట్లు వేయడం వల్ల గొడవలు ఆగిపోతాయి,+అలా, బలమైన ప్రత్యర్థుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.
19 ప్రాకారాలుగల నగరాన్ని జయించడం కన్నా నొచ్చుకున్న సహోదరుణ్ణి శాంతపర్చడం కష్టం,+కోట ద్వారాల అడ్డగడియల లాంటి తగాదాలు కూడా ఉన్నాయి.+
20 మాటల* ఫలం వల్ల మనిషి కడుపు నిండుతుంది;+తన పెదాల పంట వల్ల అతను తృప్తి పొందుతాడు.
21 జీవమరణాలు నాలుక అధీనంలో ఉన్నాయి;+దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడేవాళ్లు దాని ఫలం తింటారు.+
22 మంచి భార్యను పొందినవాడు అమూల్యమైనదాన్ని పొందాడు,+అతను యెహోవా అనుగ్రహం పొందుతాడు.+
23 పేదవాడు దీనంగా వేడుకుంటాడు,ధనవంతుడు కఠినంగా జవాబిస్తాడు.
24 ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు,+సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.+
అధస్సూచీలు
^ లేదా “ఆచరణాత్మక తెలివి.”
^ లేదా “హీనంగా చూస్తున్నాడు.”
^ లేదా “ఆత్రంగా మింగేసే ఆహారపదార్థాల.”
^ అక్ష., “పైకి ఎత్తబడతాడు.” అంటే అందకుండా, సురక్షితంగా ఉంటాడు.
^ లేదా “పూర్తి నిరాశను.”
^ లేదా “లోతుగా పరిశోధించినప్పుడు.”
^ అక్ష., “నోటి.”