యెషయా 57:1-21

  • నీతిమంతుడు, విశ్వసనీయులు నశించిపోవడం (1, 2)

  • ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వ్యభిచారం బట్టబయలౌతుంది (3-13)

  • దీనులకు ఓదార్పు (14-21)

    • దుష్టులు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం లాంటివాళ్లు (20)

    • దుష్టులకు మనశ్శాంతి ఉండదు (21)

57  నీతిమంతుడు నశించిపోయాడు,కానీ ఎవరూ దాని గురించి ఆలోచించట్లేదు. విశ్వసనీయులు తీసుకుపోబడుతున్నారు,*+అయితే విపత్తు కారణంగా*నీతిమంతుడు తీసుకుపోబడుతున్నాడని ఎవ్వరూ గ్రహించట్లేదు.   అతను నెమ్మది పొందుతాడు. నిజాయితీగా నడుచుకునే వాళ్లందరూ తమ పరుపుల మీద* విశ్రాంతి తీసుకుంటారు.   “మంత్రగత్తె కుమారులారా,వ్యభిచారికి, వేశ్యకు పుట్టిన పిల్లలారా,దగ్గరికి రండి:   మీరు ఎవర్ని గేలి చేస్తున్నారు? ఎవర్ని వెక్కిరించడానికి మీ నోళ్లు పెద్దగా తెరుస్తున్నారు? మీరు పాపులకు, అబద్ధాలాడే వాళ్లకుపుట్టిన పిల్లలు+ కాదా?   మహా వృక్షాల మధ్య,పచ్చగా ఉండే ప్రతీ చెట్టు కింద+ కామంతో రగిలిపోతున్నది+ మీరు కాదా?లోయల్లో,* బండల సందుల కిందపిల్లల్ని వధించేది మీరు+ కాదా?   నీ భాగం లోయల్లోని* నున్నని రాళ్లతో పాటు ఉంది.+ అవును, అవే నీకు వంతు. చివరికి వాటికి కూడా నువ్వు పానీయార్పణలు, కానుకలు అర్పిస్తావు.+ వీటిని బట్టి నేను సంతృప్తి చెందాలా?*   ఎత్తైన, ఉన్నతమైన పర్వతం మీద నువ్వు పరుపు వేసుకున్నావు,+బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కివెళ్లావు.+   తలుపు వెనక, గుమ్మం వెనక నీ జ్ఞాపకార్థ చిహ్నాన్ని నిలబెట్టావు. నన్ను విడిచివెళ్లి నీ బట్టలు విప్పేశావు;పైకి ఎక్కి నీ పరుపును వెడల్పు చేసుకున్నావు. వాళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నావు. వాళ్లతో కలిసి పడుకోవడమంటే నీకు చాలా ఇష్టం,+వాళ్ల పురుషాంగాన్ని నువ్వు చూశావు.*   నువ్వు తైలాన్ని, విస్తారమైన పరిమళ ద్రవ్యాన్నితీసుకొని మెలెకు* దగ్గరికి దిగివెళ్లావు. నీ ప్రతినిధుల్ని దూరంగా పంపి,సమాధిలోకి* దిగిపోయావు. 10  అనేక ప్రయాణాలు చేస్తూ చాలా కష్టపడ్డావు,కానీ ‘దీనివల్ల ఉపయోగం లేదు!’ అని నువ్వు అనుకోలేదు. నువ్వు మళ్లీ కొత్త బలం పొందావు. అందుకే నువ్వు పట్టువిడవట్లేదు.* 11  నువ్వు ఎవరికి భయపడి, ఎవరికి బెదిరిపోయి అబద్ధాలాడడం మొదలుపెట్టావు?+ నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు.+ దేని గురించీ ఆలోచించలేదు.+ నేను మౌనంగా ఉండి ఊరుకున్నాను.*+ అందుకే నువ్వు నాకు ఏమాత్రం భయపడలేదు. 12  నేను నీ బూటకపు నీతిని,+ నీ పనుల్ని+ బయటపెడతాను,వాటివల్ల నీకు ప్రయోజనమేమీ ఉండదు.+ 13  నువ్వు సహాయం కోసం మొరపెట్టినప్పుడు,నువ్వు పోగేసుకున్న విగ్రహాలు నిన్ను తప్పించలేవు.+ అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి,ఉఫ్‌ అని ఊదితే ఎగిరిపోతాయి;అయితే నన్ను ఆశ్రయంగా చేసుకున్నవాళ్లు దేశాన్ని స్వాస్థ్యంగా పొందుతారు,నా పవిత్ర పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ 14  అప్పుడు ఇలా అంటారు: ‘ఎత్తు చేయండి, దారిని ఎత్తు చేయండి! మార్గాన్ని సిద్ధం చేయండి!+ నా ప్రజల దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసేయండి.’ ” 15  ఎందుకంటే మహా ఘనుడు, ఉన్నతుడు,నిరంతరం జీవిస్తూ ఉండే* దేవుడు,+ పవిత్రమైన పేరు ఉన్న దేవుడు+ ఇలా అంటున్నాడు: “నేను ఎత్తైన, పవిత్ర స్థలంలో నివసిస్తాను,+అయితే నలిగిపోయిన వాళ్లతో, దీనమనస్సు గలవాళ్లతో కూడా నివసిస్తూదీనుల ప్రాణాలు తెప్పరిల్లేలా చేస్తాను,నలిగిపోయిన వాళ్ల హృదయాలకు నూతనోత్తేజాన్ని ఇస్తాను.+ 16  నేను నిరంతరం వాళ్లను వ్యతిరేకిస్తూ ఉండను,లేదా ఎల్లకాలం వాళ్లమీద కోపం ఉంచుకోను;+ఎందుకంటే నావల్ల మనిషి జీవశక్తి* క్షీణిస్తుంది,+నేను సృష్టించిన శ్వాసించే ప్రాణులు బలహీనమౌతాయి. 17  అతను అక్రమ లాభం కోసం పరుగులు తీస్తూ పాపం చేయడం+ చూసి నాకు చాలా కోపమొచ్చింది,అందుకే నేనతన్ని కొట్టాను, నా ముఖం దాచుకున్నాను, నాకు చాలా కోపమొచ్చింది. అయినాసరే అతను తన హృదయం నడిపించిన దారిలోనే నడుస్తూ భ్రష్టుడిలా ప్రవర్తిస్తూ వచ్చాడు.+ 18  నేను అతని మార్గాల్ని చూశాను,అయితే నేనతన్ని బాగుచేస్తాను,+ ముందుండి అతన్ని నడిపిస్తాను,+అతనికీ, దుఃఖిస్తున్న అతని వాళ్లకూ+ మళ్లీ ఊరటనిస్తాను.”*+ 19  “నేనే పెదాల మీద స్తుతించే మాటలు పెడుతున్నాను. దూరంగా ఉన్నవాళ్లకు, దగ్గరగా ఉన్నవాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తాను,+నేనే అతన్ని బాగుచేస్తాను” అని యెహోవా అంటున్నాడు. 20  “అయితే దుష్టులు, అల్లకల్లోలంగా ఉండి నిమ్మళించని సముద్రంలా ఉంటారు,దానిలోని నీళ్లు నాచును, బురదను పైకి ఎగదోస్తూ ఉంటాయి. 21  దుష్టులకు మనశ్శాంతి ఉండదు”+ అని నా దేవుడు చెప్తున్నాడు.

అధస్సూచీలు

లేదా “నుండి” అయ్యుంటుంది.
అంటే, చనిపోతున్నారు.
అంటే, సమాధిలో.
లేదా “వాగుల్లో.”
లేదా “నన్ను నేను ఊరడించుకోవాలా?”
లేదా “వాగుల్లోని.”
అబద్ధ ఆరాధనలో పురుషాంగం ప్రతిమల్ని ఉపయోగించడాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “రాజు” అయ్యుంటుంది.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
అక్ష., “అలసిపోవట్లేదు.”
లేదా “విషయాల్ని దాచిపెట్టాను.”
లేదా “నిత్య నివాసియైన.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఊరటనిచ్చి పరిహారం చెల్లిస్తాను.”