కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ప్రపంచ శాంతి ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?

ప్రజల హృదయాల్ని మార్చగల ప్రభుత్వం మాత్రమే ప్రపంచ శాంతిని తీసుకొస్తుంది

దానికి ఉన్న రెండు ముఖ్యమైన కారణాల్ని బైబిలు ప్రస్తావిస్తోంది. మొదటిది, మనుషులు ఎన్నో అద్భుతాలు సాధించినా, తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం వాళ్లకు లేదు. రెండవది, ప్రపంచమంతా సాతాను గుప్పిట్లో ఉంది కాబట్టి మనుషుల ప్రణాళికలు విఫలమయ్యాయి. అందుకే, మనుషులు ఎంతగా ప్రయత్నించినా శాంతిని తీసుకురాలేక పోయారు.—యిర్మీయా 10:23; 1 యోహాను 5:19 చదవండి.

మనుషుల నరనరాల్లో జీర్ణించుకుపోయిన స్వార్థం, అధికార దాహం వల్ల కూడా ప్రపంచ శాంతి అందని ద్రాక్ష అయ్యింది. నీతిని ప్రేమించమని, తోటివాళ్ల సంక్షేమం కోసం పాటుపడమని బోధిస్తూ మొత్తం ప్రపంచాన్ని పాలించే ప్రభుత్వం మాత్రమే ప్రపంచ శాంతిని తీసుకురాగలదు.—యెషయా 32:17; 48: 18, 22 చదవండి.

భూమ్మీద శాంతిని ఎవరు స్థాపిస్తారు?

ఈ భూమి అంతటినీ పరిపాలించే ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పుతానని సర్వశక్తిమంతుడైన దేవుడు వాగ్దానం చేశాడు. అది మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేస్తుంది. (దానియేలు 2:44) దేవుని కుమారుడైన యేసు, సమాధానకర్తయైన అధిపతిగా పరిపాలిస్తాడు. ఆయన చెడును రూపుమాపి, శాంతియుతంగా ఎలా జీవించాలో ప్రజలకు నేర్పిస్తాడు.—యెషయా 9:6, 7; 11:4, 9 చదవండి.

ఇప్పటికే యేసు ఆధ్వర్యంలో, ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది దేవుని వాక్యమైన బైబిల్ని ఉపయోగిస్తూ, తోటివాళ్లతో సమాధానంగా ఎలా ఉండవచ్చో ప్రజలకు నేర్పిస్తున్నారు. కాబట్టి త్వరలోనే, ఈ భూమ్మీద శాంతిసమాధానాలు విలసిల్లుతాయి.—యెషయా 2:3, 4; 54:13 చదవండి. (w13-E 06/01)