కంటెంట్‌కు వెళ్లు

భూమ్మీద శాంతి సాధ్యమా?

భూమ్మీద శాంతి సాధ్యమా?

బైబిలు ఇచ్చే జవాబు

ఈ భూమ్మీద శాంతిని మనుషులు తీసుకురాలేరు. దేవుని ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. దేవుని ప్రభుత్వం అంటే క్రీస్తుయేసు పరిపాలించే పరలోక ప్రభుత్వం. ఇంత చక్కని ఏర్పాటు గురించి బైబిలు ఏమి చెబుతుందో చూడండి.

  1. దేవుడు, ‘భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను ఆపివేస్తాడు,’ ‘భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతిని తీసుకొస్తాడు’ అనే తన మాటను నిలబెట్టుకుంటాడు.—కీర్తన 46:9; లూకా 2:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

  2. దేవుని ప్రభుత్వం పరలోకం నుండి ఈ భూమి మీద ఉన్న అందరినీ పరిపాలిస్తుంది. (దానియేలు 7:14) అనేక పోరాటాలకు కారణమైన ‘నా దేశమే గొప్ప’ అనే ఆలోచనను కూడా ఆ ప్రభుత్వం తీసివేస్తుంది.

  3. దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తుని ‘శాంతికి కర్త’ అని బైబిలు పిలుస్తుంది. ఎందుకంటే తన పరిపాలనలో “శాంతికి అంతం అంటూ ఉండదు.”—యెషయా 9:6, 7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

  4. ఎప్పుడూ పోట్లాడుకునే స్వభావం ఉన్న వాళ్లని తన రాజ్యంలో ఉండనివ్వడు. ఎందుకంటే, హింసను ప్రేమించేవాళ్లను యెహోవా ద్వేషిస్తాడు.—కీర్తన 11:5; సామెతలు 2:22.

  5. చుట్టూ ఉన్నవాళ్లతో శాంతిగా ఎలా జీవించాలో దేవుడు తన ప్రజలకు నేర్పిస్తాడు. అలాంటి శిక్షణవల్ల వచ్చే ఫలితాల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:3, 4.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు శాంతిగా ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు. (మత్తయి 5:9) మేము సుమారు 230 కన్నా ఎక్కువ దేశాల్లో నివసిస్తూ, వివిధ సంస్కృతులకు చెందినప్పటికీ, ఆయుధాలు పట్టుకుని పొరుగువాళ్లతో యుద్ధం చేయం.

నేడు కూడా యెహోవాసాక్షులు ఏయే మార్గాల్లో శాంతిగా ఉండాలో నేర్చుకుంటున్నారు.